Death Sentence: 28 ఏళ్ల యువకుడికి ఉరి శిక్ష.. 100 రోజుల్లోనే తీర్పునిచ్చిన కోర్టు.. అతడు చేసిన దారుణమేంటంటే..!
ABN, First Publish Date - 2023-11-14T19:03:06+05:30
కొందరు చట్టాల్లోని లొసుగులను అడ్డుపెట్టుకుని ఎన్ని నేరాలు చేసినా సమాజంలో దర్జాగా తిరుగుతుంటారు. మరోవైపు చాలా కేసులు ఏళ్లకు ఏళ్లు విచారణ జరుగుతుంటాయి. ఈ క్రమంలో కొందరు నేరస్థులు నిర్ధోషుల్లా బయటకు వస్తుంటారు. అయితే ఇంకొన్ని కేసుల్లో..
కొందరు చట్టాల్లోని లొసుగులను అడ్డుపెట్టుకుని ఎన్ని నేరాలు చేసినా సమాజంలో దర్జాగా తిరుగుతుంటారు. మరోవైపు చాలా కేసులు ఏళ్లకు ఏళ్లు విచారణ జరుగుతుంటాయి. ఈ క్రమంలో కొందరు నేరస్థులు నిర్ధోషుల్లా బయటకు వస్తుంటారు. అయితే ఇంకొన్ని కేసుల్లో మాత్రం న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరిస్తుంటాయి. తాజాగా, కేరళలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కేవలం 100 రోజుల్లో విచారణ పూర్తి చేసిన కోర్టు.. 28 ఏళ్ల యువకుడికి చివరకు ఉరి శిక్ష విధించింది. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
బీహార్‌కు (Bihar) చెందిన 28 ఏళ్ల యువకుడు.. ఉపాధి నిమిత్తం కేరళకు (Kerala) వలస వచ్చాడు. ఇక్కడ పని చేస్తున్న ప్రాంతంలో అతడికి చాలా మంది పరిచయమయ్యారు. వారిలో ఓ కుటుంబంతో అతను ఎంతో చనువుగా ఉండేవాడు. వారి ఇంటికి వస్తూ, పోతూ ఉన్న క్రమంలో అతడి కన్ను (five year old girl) ఐదేళ్ల పాపపై పడింది. ఈ క్రమంలో ఓ రోజు వారింట్లో ఎవరూ లేని సమయంలో చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం బయట తెలిసిపోతుందేమో (young man killed baby) అనే భయంతో పాపను హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఈ కేసుపై 100 రోజుల్లో విచారణ పూర్తి చేసిన కోర్టు.. నవంబర్ 14 బాలల దినోత్సవం రోజున.. నిందితుడికి ఉరి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. తీర్పు వినేందుకు బాలిక తల్లిదండ్రులు కోర్టుకు హాజరయ్యారు. బాలిక అఘాయిత్యం, హత్య.. హేయమైన చర్య అని, దీన్ని దృష్టిలో ఉంచుకుని మరణ శిక్ష విధించినట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయంపై అప్పీలు చేసుకునేందుకుర నిందితుడికి అవకాశం కల్పిస్తామని కోర్టు పేర్కొంది. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘సరైన శిక్ష విధించారు’’.. అని కొందరు, ‘‘ఇలాంటి పనులు చేయడానికి ఇంకొకరు భయపడాలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
Geyser: గీజర్‌ను వాడుతున్నారా..? ఈ 4 లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. అది బాంబులా పేలడం ఖాయం..!
Updated Date - 2023-11-14T19:07:23+05:30 IST