ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PoliceBusted DataLeak: సైబరాబాద్ పోలీసులపై ప్రశంసలు.. డేటా ప్రొటెక్షన్ బిల్లుకు డిమాండ్

ABN, First Publish Date - 2023-03-25T21:15:38+05:30

ఆధార్, పాన్‌‌కార్డ్, బ్యాంక్ అకౌంట్ వంటి గోప్యమైన వ్యక్తిగత డేటా మనకు తెలియకుండానే దొంగల ముఠా చేతుల్లోకి వెళ్తే !? ఆ డేటా అంగట్లో సరుకులా అమ్మకానికి సిద్ధంగా ఉందని తెలిస్తే!?..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ధార్, పాన్‌‌కార్డ్, బ్యాంక్ అకౌంట్ వంటి గోప్యమైన వ్యక్తిగత డేటా మనకు తెలియకుండానే దొంగల ముఠా చేతుల్లోకి వెళ్తే !? ఆ డేటా అంగట్లో సరుకులా అమ్మకానికి సిద్ధంగా ఉందని తెలిస్తే!?.. ఈ పరిణామాలకు ఎవరూ బాధ్యత వహించకపోతే!?.. ఉలిక్కిపాటుకు గురవ్వడమే జనాల వంతవుతుంది. సైబరాబాద్ పోలీసులు దేశంలోనే అతిపెద్ద డేటా లీక్ కేసును (Cyb PoliceBusted DataLeak) చేధించాక దేశమంతా ఇలాంటి ఉలిక్కిపాటు వాతావరణం ఏర్పడింది. ఏకంగా 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటా లీకయ్యిందనే అందరినీ కలవరానికి గురిచేస్తోంది. #Cyb PoliceBusted DataLeak శనివారం ట్విటర్ ట్రెండింగ్‌లో టాప్‌లోకి దూసుకొచ్చిందంటే డేటా లీక్‌పై జనాలు ఏవిధంగా స్పందిస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. డేటా లీక్ వ్యవహారం నేపథ్యంలో డేటా ప్రొటెక్షన్ బిల్లు తీసుకురావాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. సమాచార భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారిందనే విషయం ఈ ఘటన ద్వారా వెలుగుచూసిందని, అడ్డుకట్ట వేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్‌లో చట్టం తీసుకొచ్చి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు.

16 కోట్లకుపైగా మంది డేటా దొంగల ముఠా చేతిలో ఉందని, దానిని వెబ్‌సైట్లలో పెట్టి అంగటి సరుకులా అమ్ముతున్నారని వెలుగులోకి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ షాకింగ్ ఘటనపై సోషల్ మీడియా వేదికగా చాలామంది స్పందిస్తున్నారు. సైబరాబాద్ పోలీసులు బట్టబయలు చేసిన డేటా లీక్ కేసు వార్తను షేర్ చేసి తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డేటా లీక్ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. డేటా గోపత్యకు సంబంధించి దేశంలో కఠినమైన చట్టాలు తీసుకురావాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేశారు. అమెరికా, యూరప్ దేశాల్లో డేటా భద్రతకు సంబంధించి పకడ్బంధీ చట్టాలు ఉంటాయని, నేరాలకు అడ్డుకట్ట వేయాలంటే ఇక్కడ కూడా ఇలాంటి చట్టాలు ఉండాలని సూచిస్తున్నారు. ఇది చాలా షాకింగ్ న్యూస్ అని, ఇలాంటి వాటి గురించి అందరూ అవగాహనతో ఉండాలని సందేశాలిస్తున్నారు. వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచనలు చేస్తున్నారు.

సైబరాబాద్ పోలీసులపై ప్రశంసల జల్లు..

16.8 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి అడ్డదారిలో విక్రయిస్తున్న యూపీ ముఠా గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులపై ప్రశంసల జల్లుకురుస్తోంది. పోలీసులు చాలా ప్రశంసనీయమైన పనిచేశారని చాలామంది నెటిజన్లు కొనియాడారు. ‘‘ పోలీసులు అద్భుతంగా పనిచేశారు.. అభినందనలు’’, ‘‘హ్యాట్సాఫ్ పోలీస్’’ అంటూ ట్విటర్ యూజర్లు కితాబిచ్చారు. మరోవైపు ఇలాంటి డేటా లీక్ ఘటనల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కీలకమైన వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సలహాలిస్తున్నారు. కాగా.. ఎలాంటి కఠిన చట్టాలు, నిబంధనలు ఆచరణలో ఉన్నా జనాలు కూడా వ్యక్తిగత డేటా విషయంలో అవగాహనతో ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.



ఇవీ కూడా చదవండి...

ప్రపంచ మహిళా బాక్సింగ్ విజేత నీతూ ఘంఘాస్

రేపు నింగిలోకి ఎల్‌వీఎం3-ఎం3 రాకెట్‌

Updated Date - 2023-03-25T21:25:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising