ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Train Video: రద్దీ రైల్లో సీటు కోసం ప్రమాదకరంగా వేలాడుతూ ఇతను చేసిన ప్రయత్నం.. చివరకు ఫలించిందో లేదో మీరే చూడండి..

ABN, First Publish Date - 2023-06-30T15:04:52+05:30

బస్సు, రైలు ప్రయాణాల్లో సీటు కోసం చాలా మంది చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. ప్రమాదమని తెలిసినా త్వరగా గమ్యస్థానం చేరాలనే ఉద్దేశంతో కొంతమంది ప్రాణాలకు తెగించి ప్రయాణం చేస్తుంటారు. ప్రధానంగా రైలు ప్రయాణ సమయాల్లో ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇక..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బస్సు, రైలు ప్రయాణాల్లో సీటు కోసం చాలా మంది చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. ప్రమాదమని తెలిసినా త్వరగా గమ్యస్థానం చేరాలనే ఉద్దేశంతో కొంతమంది ప్రాణాలకు తెగించి ప్రయాణం చేస్తుంటారు. ప్రధానంగా రైలు ప్రయాణ సమయాల్లో ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇక ముంబై నగరంలో లోకల్ ట్రైన్లలో జనం ఎంత రద్దీగా ప్రయాణిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇటీవల తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. రద్దీగా ఉన్న రైల్లో సీటు కొందరు యువకులు చేసిన ప్రమాదర ప్రయాణం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు..

సోషల్ మీడియాలో ముంబై లోకల్ ట్రైన్ ప్రయాణానికి సంబంధించిన ఓ వీడియో (Mumbai Local Train Video) తెగ చక్కర్లు కొడుతోంది. అప్పటికే కిక్కిరిసి ఉన్న లోకల్ రైలు ఓ స్టేషన్‌కి వచ్చి ఆగింది. బోగీలోకి వెళ్లడానికి కూడా స్థలం లేకున్నా చాలా మంది యువకులు డోరు వద్ద వేలాడుతూ.. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతలో ఓ యువకుడు మరీ ప్రమాదకరంగా వేలాడుతూ (Dangerous journey) ఉన్నాడు. కనీసం కాలు పెట్టడానికి కూడా స్థలం లేకున్నా.. అటు లోపలికి వెళ్లలేక, ఇటు కింద పడతాననే భయంతో చేతులతో గట్టిగా పట్టుకుని ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

Dog vs Leopard: అర్ధరాత్రి సైలెంట్‌గా ఇంట్లోకి చిరుతపులి ఎంట్రీ.. పెంపుడు కుక్క చూసి అరుస్తోంటే.. అదేం చేసిందో చూస్తే..!

ఇంతలో రైలు స్టేషన్ నుంచి కదిలింది. అయినా అతను మాత్రం వేలాడుతూనే ఉన్నాడు. రైలు అత్యంత వేగంగా వెళ్తున్నా వారంతా డోరు వద్ద వేలాడుతూనే ఉన్నారు. ఏమాత్రం చేయి జారినా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కానీ వారు మాత్రం ఎంతమాత్రం భయం లేకుండా వెళ్లడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ ఘటనను బోగీలో ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి ప్రయాణం.. చాలా ప్రమాదకరం’’.. అని కొందరు, ‘‘పొట్టకూటి కోసమే.. ఈ పోరాటం’’.. అని మరికొందరు, ‘‘వామ్మో! ఇలాంటి ప్రయాణం ఎక్కడా చూడలేదు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Bride Video: ఈ వధువును చూసి జాలి పడుతున్న నెటిజన్లు.. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? వరుడి నిర్వాకం చూస్తే..!

Updated Date - 2023-06-30T15:04:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising