Viral Video: నదిలో స్నానం చేసిన మహిళ వీడియో చూసి ఉలిక్కిపడిన పోలీసులు.. ఇంతకీ ఆమె చేసిన నిర్వాకమేంటో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-10-10T15:31:20+05:30
ప్రస్తుతం యువతతో పాటూ చాలా మంది మహిళలతో పాటూ వృద్ధుల వరకూ రీల్స్ చేయడం విధిగా మారింది. ఈ పిచ్చి కాస్తా కొన్నిసార్లు ఫీక్స్‌కు వెళ్తోంది. కొందరైతే స్థలం, సమయం, సందర్భంతో పని లేకుండా రీల్స్ చేయడమే ధ్యేయంగా పెట్టుకుంటుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు...
ప్రస్తుతం యువతతో పాటూ చాలా మంది మహిళలతో పాటూ వృద్ధుల వరకూ రీల్స్ చేయడం విధిగా మారింది. ఈ పిచ్చి కాస్తా కొన్నిసార్లు ఫీక్స్‌కు వెళ్తోంది. కొందరైతే స్థలం, సమయం, సందర్భంతో పని లేకుండా రీల్స్ చేయడమే ధ్యేయంగా పెట్టుకుంటుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వారి నిర్వాకం పెద్ద సమస్యగా మారడంతో పాటూ ఎదుటివారకీ ఇబ్బందిని కలిగిస్తుంటుంది. తాజాగా, ఓ మహిళ ఇలాంటి పనే చేసింది. నదిలో స్నానం చేస్తూ మహిళ చేసిన వీడియో చూసి పోలీసులు షాక్ అయ్యారు. చివరికి ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) ప్రముఖ పుఱ్యక్షేత్రమైన అయోధ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటైన అయోధ్యలోని రామ మందిరాన్ని (Ayodhya Ram Mandir) దర్శించుకునేందుకు ఎక్కడెక్కడినుంచో భక్తులు తరలి వస్తుంటారు. ఈ క్రమంలో ఇక్కడి సరయూ నది ఒడ్డున షున్న రామ్‌కి పైడి ఘాట్ వద్ద భక్తులు భక్తిశ్రద్ధలతో స్నానాలు ఆచరిస్తుంటారు. భక్తులు అతి పవిత్రంగా భావించే ఈ స్థలంలో ఓ మహిళ చేసిన నిర్వాకం.. అందరి ఆగ్రహానికి కారణమవుతోంది. దైవ దర్శనానికి వచ్చిన మహిళ.. నదిలో రీల్స్ చేసేందుకు సిద్ధమైంది. నీటిలో స్నానం చేసిన ఆమె.. బాలీవుడ్ సినిమాలోని ‘‘జీవన్ మే జానే జానా’’ పాటకు అసభ్యకర రీతిలో (Woman dances in the river) డాన్స్ చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చూసిన వారంతా మండిపడుతున్నారు. చివరకు ఈ వీడియో పోలీసుల వరకూ వెళ్లింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇలాంటి ఘటనలు పురరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇదిలావుండగా, ఈ ఏడాది జనవరిలో, జూన్‌లో కూడా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. ఓ యువతి స్నానం చేస్తూ ఇలాగే హిందీ పాటకు అసభ్యకర రీతిలో డాన్సులు చేస్తూ రీల్స్ చేసింది. ఆలయాలు, ప్రార్థనా స్థలాల వద్ద ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని అప్పట్లో పోలీసులు పలుమార్లు హెచ్చరించారు. కానీ తాజాగా, ఈ మహిళ వీడియోతో మళ్లీ భక్తుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, నదిలో మహిళ డాన్సు వేస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-10-10T15:31:20+05:30 IST