ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Diamonds in Tea Powder: టీ పౌడర్ ప్యాకెట్‌ను కత్తిరించి.. ఓ ప్లేట్‌లో పోస్తోంటే బయటపడిన వజ్రాలు.. వాటి ఖరీదెంతో తెలిసి..!

ABN, First Publish Date - 2023-08-12T21:47:59+05:30

వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలోనో లేదా ఏదైనా పాడుబడ్డ ఇళ్లను కూలుస్తున్న సమయంలోనో.. ఉన్నట్టుండి కళ్లు జిగేల్‌మనే దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఎవరూ ఊహించని విధంగా బంగారు నాణేలు బయటపడుతుంటాయి. మరికొన్నిసార్లు..

వ్యవసాయ పనులు చేస్తున్న సమయంలోనో లేదా ఏదైనా పాడుబడ్డ ఇళ్లను కూలుస్తున్న సమయంలోనో.. ఉన్నట్టుండి కళ్లు జిగేల్‌మనే దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు ఎవరూ ఊహించని విధంగా బంగారు నాణేలు బయటపడుతుంటాయి. మరికొన్నిసార్లు పురతాన విగ్రహాలు కూడా దర్శనమిస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనలో.. ఓ టీ ప్యాకెట్ ఓపెన్ చేయగా.. వజ్రాలు బయటపడ్డాయి. టీ ప్యాకెట్ ఏంటీ, అందులో వజ్రాలు బయటపడడం ఏంటీ.. అని ఆశ్చర్యపోతున్నారా.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ముంబయి విమానాశ్రయంలో (Mumbai Airport) ఈ ఘటన చోటు చేసుకుంది. ద‌క్షిణ ముంబైలోని నుల్ బ‌జార్‌కు చెందిన 30 ఏళ్ల ముకిమ్ రాజా అష్ర‌ఫ్ మ‌న్సూరీ అనే వ్యక్తి.. దుబాయ్ (Dubai) వెళ్లేందుకు ఆగస్టు 9వ తేదీన లగేజీతో విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే అప్పటికే అందిన సమాచారంతో కస్టమ్స్ అధికారులు (Customs officials) అతడి కోసం వేచి చూస్తూ ఉన్నారు. అనుమానాస్పదంగా కనిపించడంతో లగేజీని (Luggage checking) మొత్తం చెక్ చేశారు. అయినా ఎక్కడా ఏమీ దొరకలేదు. చివరకు వారి కళ్లు టీ ప్యాకెట్‌పై పడ్డాయి. ఓ సారి చెక్ చేస్తే పోలా.. అనుకుని ప్యాకెట్‌ను కత్తిరించి చూశారు.

Metro Train: మెట్రో రైల్లో సరదాగా మాట్లాడుకుంటున్న ఫ్రెండ్స్.. సడన్‌గా వాళ్ల వద్దకు వచ్చిందో మహిళ.. ఆమె చెప్పింది విని..!

టీ ప్యాకెట్‌ను తెరచి చూడగా, ఇంకేముందీ.. అందులో నుంచి వజ్రాల ప్యాకెట్లు (diamonds Packets) ఒక్కొక్కటిగా బయటపడేసరికి అంతా అవాక్కయ్యారు. వాటిని నిశితంగా పరిశీలించగా.. అవన్నీ 1559.6 క్యారెట్ల సహజసిద్ధ వజ్రాలని తెలిసింది. సుమారు రూ.1.49 కోట్ల విలువ చేస్తాయని అధికారులు తెలిపారు. ఈ వజ్రాలను స్మగ్లింగ్ చేస్తే తనకు రూ.5వేలు ఇస్తామన్నారని విచారణలో మన్సూరీ తెలిపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడి వెనుక ఏదైనా ముఠా ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Love story: రియల్ ‘‘మల్లీశ్వరి’’.. ప్రియుడి కోసం ఏకంగా వేల కోట్ల ఆస్తిని వదిలేసి.. చివరికి మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్..

Updated Date - 2023-08-12T21:47:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising