Viral Video: ఇతను డాక్టరా.. లేక శాడిస్టా.. అందరి ముందే రోగి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి..
ABN, First Publish Date - 2023-10-29T15:02:04+05:30
వైద్యో నారాయణో హరి.. అని వైద్యులను అంటూ ఉంటాం. ఏ రోగమొచ్చినా డాక్టర్ ఉన్నాడనే ధైర్యం ఉంటుంది. అంత విలువు ఉన్న వైద్య వృత్తికి కొందరు చేసే పనుల వల్ల అప్పుడప్పుడూ చెడ్డ పేరు వస్తుంటుంది. వైద్యం చేసి రోగిని బాగుచేయాల్సింది పోయి.. వారిని ..
వైద్యో నారాయణో హరి.. అని వైద్యులను అంటూ ఉంటాం. ఏ రోగమొచ్చినా డాక్టర్ ఉన్నాడనే ధైర్యం ఉంటుంది. అంత విలువు ఉన్న వైద్య వృత్తికి కొందరు చేసే పనుల వల్ల అప్పుడప్పుడూ చెడ్డ పేరు వస్తుంటుంది. వైద్యం చేసి రోగిని బాగుచేయాల్సింది పోయి.. వారిని వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతూ పైశాసిక ఆనందం పొందుతుంటారు. ఇలాంటి వైద్యులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‍చల్ చేస్తోంది. రోగి పట్ల రాక్షసంగా ప్రవర్తించిన వైద్యుడిని చూసి.. ‘‘ఇతను డాక్టరా.. లేక శాడిస్టా’’.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఇండోర్‌లోని మహారాజా యశ్వంతరావు ప్రభుత్వ ఆస్పత్ర ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన మదన్ సింగ్ అనే వ్యక్తికి రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో అతన్ని కుటుంబ సభ్యులు ఉజ్జయినిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి నుంచి ఇండోర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. మదన్ సింగ్‌ను స్ట్రెచర్‌పై ఆస్పత్రి ఓపీడీలోకి తీసుకెళ్లారు. మదన్ సింగ్ హెచ్ఐవీ పాజిటివ్. అయితే ఈ విషయం అతడికి చికిత్స చేసిన జూనియర్ డాక్టర్ ఆకాష్ కౌశల్‌కు తెలిసింది. దీంతో అతను ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యాడు. ‘‘నీకు హెచ్ఐవీ ఉందనే విషయం నాకు ముందు ఎందుకు చెప్పలేదు’’.. అంటూ అతన్ని (doctor attacked the patient) అందరి ముందూ చితకబాదాడు.
రోగి ఎంత వేడుకుంటున్నా వినకుండా వైద్యుడు అతడి మొఖంపై పలుమార్లు కొట్టాడు. దీంతో మదన్ సింగ్ మొఖంపై రక్త గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు కుటుంబ సభ్యులు సీఎం హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో జూనియర్ డాక్టర్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నామని ఆస్పత్రి ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు వైద్యుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇలాంటి వైద్యుల వల్ల... వారి వృత్తికే చెడ్డపేరు’’.. అని కొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-10-29T15:05:22+05:30 IST