PIB Fact Check: కరెన్సీ నోట్లపై గీతలు, రాతలుంటే చెల్లవు.. ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తెలిందంటే..!

ABN , First Publish Date - 2023-02-25T08:41:18+05:30 IST

ఇటీవల సోషల్ మీడియాలో కరెన్సీ నోట్లకు (Currency Notes) సంబంధించిన ఓ సందేశం తెగ వైరల్ అయింది.

PIB Fact Check: కరెన్సీ నోట్లపై గీతలు, రాతలుంటే చెల్లవు.. ఫ్యాక్ట్ చెక్‌లో ఏం తెలిందంటే..!

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల సోషల్ మీడియాలో కరెన్సీ నోట్లకు (Currency Notes) సంబంధించిన ఓ సందేశం తెగ వైరల్ అయింది. "ఆర్‌బీఐ తాజా గైడ్‌లైన్స్ ప్రకారం నోట్లపై రాతలు, గీతలు ఉండకూడదు. ఒకవేళ అలా కరెన్సీ నోట్లపై ఏమైనా రాతలు, పిచ్చి గీతలు ఉంటే అవి చెల్లవు. అలాంటి వాటిని ఎవరూ తీసుకోరు. యూఎస్ డాలర్ మాదిరిగానే ఇది కూడా. ఒకవేళ యూఎస్ డాలర్‌పై రాతలు ఉంటే ఎవరూ దాని తీసుకోరు. ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేయండి. ఎందుకుంటే భారత ప్రజలకు ఈ మెసేజ్ విలువ తెలియాలి" ఇది ఆ సందేశం సారాంశం. కరెన్సీ నోట్లపై రాతలు ఉంటే అవి నిజంగానే చెల్లవా? ఆర్బీఐ ఏం చెబుతోంది? అందులో నిజమెంత? ఈ ప్రచారంపై తాజాగా ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ స్పందించింది.

అలాంటి ప్రకటనల్లో నిజం లేదని కొట్టిపారేసింది. నోట్లపై రాతలు ఉంటే చెల్లవని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గైడ్‌లైన్స్ ఇచ్చిందంటూ వైరల్ అయిన ఈ ఫేక్ నోట్ వల్ల ప్రజల్లో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. ఆర్‌బీఐ అలాంటి గైడ్‌లైన్స్ ఏమీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. కానీ, కరెన్సీ నోట్లు త్వరగా పాడవకుండా ఉండేందుకు ఎలాంటి రాతలు రాయొద్దని మాత్రం ప్రజలను కోరింది. ఇక తాజాగా పీఐబీ ఇచ్చిన ఈ క్లారిటీతో ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి తెరపడినట్టైంది.

ఇది కూడా చదవండి: గతేడాది రూ.25 కోట్ల లాటరీ గెలిచిన ఈ ఆటో డ్రైవర్.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలిస్తే..


Updated Date - 2023-02-25T08:52:31+05:30 IST