Viral: అత్తింట్లో కూతురి కష్టాలు చూసి చలించిపోయిన తండ్రి.. బాణసంచా, ఊరేగింపుతో ఏం చేశాడంటే..?
ABN, First Publish Date - 2023-10-18T14:01:49+05:30
రోజులు మారాయి. ఒకప్పుడు తనను తన భర్త వేధిస్తున్నాడని కూతురు తల్లిదండ్రులకు చెబితే సర్దుకుపోమ్మని చెప్పేవారు. లేదంటే ఇద్దరిని కూర్చొబెట్టి మాట్లాడేవారు. అవసరమైతే పెద్ద మనుషులతో చెప్పించేవారు. చివరకు కష్టమో, నష్టమో.. కొట్టినా, తిట్టినా.. నీ భర్తే కదా సర్దుకుపోమ్మని కూతురికి చెప్పేవారు.
రాంచీ: రోజులు మారాయి. ఒకప్పుడు తనను తన భర్త వేధిస్తున్నాడని కూతురు తల్లిదండ్రులకు చెబితే సర్దుకుపోమ్మని చెప్పేవారు. లేదంటే ఇద్దరిని కూర్చొబెట్టి మాట్లాడేవారు. అవసరమైతే పెద్ద మనుషులతో చెప్పించేవారు. చివరకు కష్టమో, నష్టమో.. కొట్టినా, తిట్టినా.. నీ భర్తే కదా సర్దుకుపోమ్మని కూతురికి చెప్పేవారు. దీంతో చేసేదేమి లేక ఏదో ఒక విధంగా భార్య సర్దుకుపోయేది. భర్త ఎంతగా హింసించిన ఎటు వెళ్లలేక చివరకు అత్తవారింట్లోనే ఉండిపోయేది. కానీ ప్రస్తుతం రోజులు మారాయి. తన కూతురిని భర్త వేధిస్తున్నాడని తెలిస్తే ఏ తండ్రి చూస్తూ ఉరుకోవడం లేదు. సర్ది చెప్పే రోజులు కూడా పోయాయి. వెంటనే తమ కూతురిని పుట్టింటికి తెచ్చేస్తున్నారు. అవసరమైతే విడాకులు కూడా ఇప్పించేస్తున్నారు. అయితే ఓ తండ్రి ఇంకా ఇంతకుమించే చేశాడు. అత్తింట్లో అష్టకష్టాలు పడుతున్న తన కూతురి బాధలను చూడలేక చలించిపోయాడు. దీంతో వెంటనే ఇంటికి తెచ్చేశాడు. అది కూడా సాధారణంగా కాదు. మేళతాళాలతో బాణంసంచా పేల్చి ఊరేగింపుగా ఇంటికి తెచ్చాడు. పెళ్లి చేసిన నాడు అత్తారింటికి ఎంత ఘనంగా పంపాడో.. అంతే ఘనంగా ఇంటికి కూడా తెచ్చేశాడు. ఈ ఘటన ఈ నెల 15న జరిగింది. కష్టాల నుంచి విముక్తి కల్పించేందుకు ఆ తండ్రి త్వరలోనే కూతురికి విడాకులు కూడా ఇప్పించబోతున్నాడు.
పూర్తి వివరాల్లో వెళ్తే.. ఝార్ఖండ్‌లోని రాంచీ సిటీకి చెందిన ప్రేమ్ గుప్తా అనే వ్యక్తి తన కూతురు సాక్షి గుప్తాకు 2022లో వివాహం జరిపించాడు. సచిన్ కుమార్ అనే వ్యక్తితో 2022 ఏప్రిల్‌లో అంగరంగ వైభంగా వివాహం చేశాడు. కానీ పెళ్లయిన కొన్ని రోజులకు సాక్షిని భర్త సచిన్ వేధించడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా అప్పటికే సచిన్‌కు మరో వివాహం కూడా అయింది. కానీ ఈ విషయం దాచిపెట్టి సాక్షిని వివాహం చేసుకున్నాడు. భర్త వేధింపులు, అతను చేసిన మోసం గురించి సాక్షి తన తల్లిదండ్రులకు చెప్పింది. కానీ తల్లిదండ్రులు ఆమెకు సర్దిచెప్పారు. దీంతో వారి సూచనతో సచిన్‌తో సాక్షి కాపురం చేసింది. కానీ ఇదే అవకాశంగా తీసుకున్న సచిన్ భార్యను మరింత వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఇక అతనితో కలిసి జీవించడం సాధ్యం కాదని నిర్ణయించుకున్న సాక్షి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కుమార్తె పరిస్థితిని అర్థం చేసుకున్న తల్లిదండ్రులు ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. వెంటనే ఆమె తండ్రి ప్రేమ్ గుప్తా కూతురిని ఇంటికి తీసుకొచ్చాడు. పెళ్లి చేసినప్పుడు కూతురిని ఎంత ఘనంగా అత్తింటికి పంపాడో.. ఇంటికి తీసుకొచ్చేటప్పుడు అంతే ఘనంగా పుట్టింటికి తీసుకొచ్చాడు. మేళతాళాల నడుమ టపాసులు పేలుస్తూ ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చాడు. కుమార్తెలు ఎంతో విలువైనవారని చెబుతున్న ప్రేమ్ గుప్తా.. అత్తింట్లో వారికి ఇబ్బందులు కల్గితే గౌరవంతో పుట్టింటికి తీసుకురావాలని చెబుతున్నాడు. ఇక సచిన్ కుమార్‌తో తనకు విడాకులు కావాలని సాక్షి గుప్తా కోర్టును ఆశ్రయించింది.
Updated Date - 2023-10-18T14:06:57+05:30 IST