Viral Video: ప్రేయసి కోసం చేసిన అప్పులను తీర్చలేక.. ఆ ప్రియుడు చేసిన నిర్వాకం చూస్తే నవ్వాపుకోలేరు..!
ABN, First Publish Date - 2023-10-25T12:50:58+05:30
మన్మథుడు సినిమాలో హీరో నాగార్జున ఓ ప్రేమికుడికి హితబోధ చేస్తూ.. ప్రేయసికి ప్రియుడు చేసే ఖర్చుల విషయంలో చెప్పే డైలాగ్ "బిల్లు మనకు.. థ్రిల్ వాళ్లకు" గుర్తుండే ఉంటుంది కదా.
Viral Video: మన్మథుడు సినిమాలో హీరో నాగార్జున ఓ ప్రేమికుడికి హితబోధ చేస్తూ.. ప్రేయసికి ప్రియుడు చేసే ఖర్చుల విషయంలో చెప్పే డైలాగ్ "బిల్లు మనకు.. థ్రిల్ వాళ్లకు" గుర్తుండే ఉంటుంది కదా. ఈ డైలాగ్ ఇప్పటి ప్రేమికులకు సరిగ్గా సరిపోతుంది. అంటే.. ప్రేమజంటలందరికీ కాదనుకోండి. కానీ, చాలా వరకు ఇప్పటి ప్రేమజంటల విషయంలో ఇది నూటికి నూరుపాళ్లు నిజం. మనం ప్రేమించే వ్యక్తి అందంగా ఉన్నారా? లేదా? అనే విషయం పక్కన పెడితే.. మన మీదా ఖర్చు చేసే పోజిషన్ ఎదుటివారికి ఉందా? లేదా? అని లెక్కలు ముందే వేసుకుని మరీ ప్రేమలో దిగుతున్నారు నేటి యువత. ఇక తాము ప్రేమించే వ్యక్తి ముందు బాగా ఉన్నవారిలా బిల్డప్ కొట్టేవారు.. ఆ తర్వాత అప్పులపాలు కావడం తప్పదు. ఇదిగో ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
Crime: పోలీసుల ముందు నిల్చున్న ఇతడు అమాయకంగా కనిపిస్తున్నాడు కానీ.. అతడి ఇంట్లో వెతికితే ఏం బయటపడ్డాయో తెలిస్తే..!
ఓ వ్యక్తి తన ప్రేయసి కోసం చేసిన అప్పులను తీర్చలేక.. బాకీ ఇచ్చినవాళ్లు పెట్టే ఇబ్బందులను వర్ణిస్తూ.. ఒక పాట రాయడం, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. సదరు ప్రేమికుడు.. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'దిల్‌వాలే' లోని 'జీథాత జీసకే లియే.. జీసకే లియే మర్తథా' అనే పాటకు పేరడీగా ఈ పాటను రాయడం జరిగింది. 'కితనా కర్జ్ హై మేరే సర్‌పే.. కైసే చుకాంవు ఉసే' అంటూ సాగే ఈ పేరడీ సాంగ్ ఇప్పుడు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. తాను ప్రియురాలి కోసం చేసిన అప్పులు, ఆ తర్వాత ఆ అప్పులు ఇచ్చిన వ్యక్తులు పెడుతున్న బాధలను వర్ణిస్తూ ప్రేమికుడు ఈ సాంగ్‌ను రాసుకొచ్చాడు. దాన్ని వివరిస్తూ వీడియో తీసి, అక్టోబర్ 10వ తారీఖున ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడం చేశాడు. అంతే.. వీడియో కాస్తా వైరలయింది.
Viral News: ప్లీజ్ అంటూ వేడుకున్న కస్టమర్.. చెత్త డబ్బాలోంచి ఆ రెస్టారెంట్ ఓనర్ ఏం తీసి ఇచ్చారంటే..!
ఈ వీడియోకు ఇప్పటివరకు ఏకంగా 17.55లక్షల లైక్స్ వచ్చాయి. అలాగే వందలాది మంది నెటిజన్లు తమదైన శైలిలో కామెడీ కామెంట్స్ చేస్తున్నారు. 'ఎందుకు భయ్యా.. నా పాట నీవు పాడుతున్నావు' అని ఒకరు, 'మేము కూడా చాలా బాధ పడుతున్నాం' అని మరోకరు, 'ఇది నేరుగా గుండెపై ఎటాక్ బ్రదర్. నేను ఇప్పటివరకు చేసిన అప్పులు తీర్చలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను' అని ఇంకొకరు,'నీవు కూడా అచ్చం నాలాంటి సమస్యను ఎదుర్కొంటున్నందుకు చాలా బాధగా ఉంది' అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
Namma Yatri App: బెంగళూరు ఆటో డ్రైవర్లా మజాకా.. యాప్ ద్వారా ఒక్క ఏడాదిలోనే రూ.189 కోట్ల సంపాదన..!
Updated Date - 2023-10-25T12:50:58+05:30 IST