ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Triangle love story: ప్రేయసితో కలిసి కారులో షికారుకెళ్లిన ప్రియుడు.. మార్గ మధ్యలో డ్రైవర్‌ ఎవరో తెలుసుకుని తేరుకునేలోపే..

ABN, First Publish Date - 2023-08-31T21:54:11+05:30

ప్రేమ వ్యవహారాల్లో కొన్నిసార్లు సినిమా తరహా ట్విస్టులు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలు కొన్నిసార్లు విషాదకరంగా కూడా మారుతుంటాయి. కొన్నిసార్లు ప్రియురాలిని దక్కించుకునేందుకు ప్రియుళ్లు, ప్రియుడిని వదిలించుకునేందుకు ప్రియురాళ్లు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో...

ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ వ్యవహారాల్లో కొన్నిసార్లు సినిమా తరహా ట్విస్టులు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ఘటనలు కొన్నిసార్లు విషాదకరంగా కూడా మారుతుంటాయి. కొన్నిసార్లు ప్రియురాలిని దక్కించుకునేందుకు ప్రియుళ్లు, ప్రియుడిని వదిలించుకునేందుకు ప్రియురాళ్లు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొందరు దారుణాలకు తెగబడుతుంటారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ప్రేయసితో కలిసి కారులో షికారుకెళ్లిన ప్రియుడు.. మార్గ మధ్యలో డ్రైవర్ ఎవరో తెలుసుకుని షాక్ అయ్యాడు. చివరకు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘాజీపూర్‌లోని నంద్‪గంజ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక తారావ్ గ్రామానికి చెందిన మనీష్ అనే యువకుడికి.. వైజల్‌పూర్ ప్రాంతానికి చెందిన మీనూ అనే యువతికి మధ్య కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడంతో వీరి మధ్య ప్రేమ (Love) మొదలైంది. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో మీనూ అతన్ని దూరం పెట్టింది. ఈ క్రమంలో మీనూకు ఇటీవల రాజేష్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ప్రస్తుతం వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. మరోవైపు మనీష్ మాత్రం మీనూ మర్చిపోలేక పదే పదే మాట్లాడమంటూ, కలవమంటూ వెంటపడేవాడు.

Viral Video: ఆగి ఉన్న విమానం వద్ద సిబ్బంది చేసిన పని చూసి ప్రయాణికుడు షాక్.. వెంటనే వీడియో తీయడంతో చివరికి ఏం జరిగిందంటే..

దీంతో విసిగిపోయిన మీనూ చివరకు ఈ విషయాన్ని రాజేష్‌కు చెప్పింది. చివరికి ఇద్దరూ కలిసి మనీష్ హత్యకు కుట్ర పన్నారు. ఆగస్టు 28న మనీష్‌కు ఫోన్ చేసిన మీనూ.. బయటికి షికారుకు వెళ్దామని పిలిచింది. అప్పటికే రాజేష్ డ్రైవర్‌ వేషంలో కారుతో సిద్ధంగా ఉన్నాడు. కారులో నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లాక.. మనీష్‌కు మద్యం తాగించారు. అతను డ్రైవర్ కాదని, కొత్త ప్రియుడని తెలుసుకుని తేరుకునేలోపే ఇద్దరూ కలిసి మనీష్‌పై దాడి (Assault on ex-boyfriend) చేసి హత్య చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral Video: ఇది పానీపూరీ యుద్ధం.. ఈ యువకుల గొడవ వెనుక కారణం తెలిస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Updated Date - 2023-08-31T21:54:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising