Glass Bridge: ప్రముఖ పర్యాటక కేంద్రంలో రూ.37 కోట్లతో అద్దాల వంతెన
ABN , First Publish Date - 2023-05-24T11:21:14+05:30 IST
ప్రముఖ పర్యాటక ప్రాంతం కన్నియాకుమారి(Kanniyakumari)లో తిరువళ్లువర్ విగ్ర హం, వివేకానంద స్మారక మండపం నడుమ రూ.37 కోట్లతో

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పర్యాటక ప్రాంతం కన్నియాకుమారి(Kanniyakumari)లో తిరువళ్లువర్ విగ్ర హం, వివేకానంద స్మారక మండపం నడుమ రూ.37 కోట్లతో కాలినడక అద్దాల వంతెనను నిర్మించనున్నారు. ఈ వంతెనకు ఈనెల 24న మంత్రి ఈవీ వేలు(Minister Ev Velu) శంకుస్థాపన చేయనున్నారు. కన్నియాకుమారికి దేశవిదేశాల నుండి వచ్చే పర్యాటకులు వివేకానంద స్మారక మండపానికి బోట్‌సఫారీ చేసి వెళుతుంటారు. అయితే ఆ ప్రాంతానికి చేరువగా ఉన్న తిరువళ్లువర్ విగ్రహానికి సులువుగా వెళ్ళలేకున్నారు. దీనితో ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ కాలినడక వంతెన నిర్మించాలని స్థానికులు, పర్యాటకులు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశారు. వీరి కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ రెండు ప్రాంతాలను కలిపే రీతిలో 97 మీటర్ల పొడవు, నాలుగు మీటర్ల వెడల్పు, పైకప్పుతో అద్దాల వంతెనను నిర్మించనుంది. మంత్రి మనో తంగరాజ్, జిల్లా కలెక్టర్ శ్రీధర్, మేయర్ మహేష్ తదితరులు పాల్గొననున్నారు.