ఆ భర్తకు రాకూడని అనుమానమే వచ్చింది.. చివరకు జరగకూడని ఘోరమే జరిగింది..!
ABN, First Publish Date - 2023-02-23T18:29:15+05:30
అనుమానం.. పెను భూతం లాంటిది. జీవితం నాశనం అవ్వడానికే తప్ప ఇంకెందుకు పనికి రానిది. వైవాహిక బంధం (Marital relationship)లో ఇది మరీ ప్రమాదం. అనుమానాలతో
అనుమానం.. పెను భూతం లాంటిది. జీవితం నాశనం అవ్వడానికే తప్ప ఇంకెందుకు పనికి రానిది. వైవాహిక బంధం (Marital relationship)లో ఇది మరీ ప్రమాదం. అనుమానాలతో సంసారాలు నాశనం అయిపోయిన దుర్ఘటనలు ఎన్నో మన కళ్ల ముందు చూశాం. తాజాగా ఇలాంటి ఉదంతమే కర్ణాటక (Karnataka)లో చోటుచేసుకుంది. ఏకంగా ఫ్యామిలీనే మంటల్లో సజీవదహనం చేశాడు ఓ ప్రబుద్దుడు.
చిక్కబళ్లాపుర జిల్లా శిడ్లఘట్ట తాలూకా హెణ్ణూరులో నివాసం ఉండే సొణ్ణేగౌడ, నేత్రావతి భార్యాభర్తలు. కుమార్తెలిద్దరూ స్నేహ(11), హర్షిణి (9) చదువుకుంటున్నారు. సొణ్ణేగౌడ వృత్తిరీత్యా వ్యవసాయం (Agriculture) చేస్తుండగా, భార్య నేత్రావతి గృహిణి. భార్యకు అక్రమ సంబంధం ఉందంటూ భర్త అనుమానిస్తూ వచ్చేవాడు. ఇదే విషయమై మంగళవారం రాత్రి కూడా తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో కోపం పట్టలేక రాక్షసుడిలా మారిపోయాడు. అంతే భార్య, పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ మంటలను తాళలేక సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. అరుపులు విన్న స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే చేయి దాటి పోయింది. మంటలు ఉవ్వెత్తన రావడంతో నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. మరో వైపు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. భార్యాభర్తలు రోజూ గొడవలు పడుతున్నా.. ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదని గ్రామస్తులు ఆవేదన చెందారు.
ఇది కూడా చదవండి: ఆర్టీసీ బస్సులో ఓ యువతిపై మూత్ర విసర్జన చేసిన 25 ఏళ్ల యువకుడు.. విమానంలోనే కాదు.. బస్సులోనూ అదే సీన్ రిపీట్..!
Updated Date - 2023-02-23T18:29:20+05:30 IST