ఈ పురుగు మీకు కనబడితే మీ పంట పండినట్టే.. కోట్లరూపాయలు ఇచ్చి కొనడానికి సిద్దమట.. ఇంతకూ ఇదేంటంటే..

ABN , First Publish Date - 2023-03-12T13:16:00+05:30 IST

కోట్లు ఇచ్చి పురుగులను ఎవరు కొంటారని అనుకుంటారేమో కానీ నిజమండీ బాబూ..

ఈ పురుగు మీకు కనబడితే మీ పంట పండినట్టే.. కోట్లరూపాయలు ఇచ్చి కొనడానికి సిద్దమట.. ఇంతకూ ఇదేంటంటే..

ఖరీదైన కారు, ఇల్లు, విలాసవంతమైన జీవితం ఇవన్నీ కావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. కోటీశ్వరులుగా మారితే కానీ అవన్నీ మన సొంతం కావు. కానీ ఒక్క పురుగు మీకు కనబడితే మీ జీవితమే మారిపోతుంది. ఈ పురుగు కోసం కోట్ల రూపాయలు అయినా ఇచ్చేస్తారట. కోట్లరూపాయలు ఇచ్చి పురుగులను ఎవరు కొంటారు అనుకుంటారేమో.. కానీ నిజమండీ బాబూ.. అక్షరాలా కోట్ల రూపాయలకు అమ్ముడుపోతుంది ఇది. ఇంతకీ ఇదేం పురుగు? దీనికి ఎందుకంత డిమాండ్? తెలుసుకుంటే..

ఈ ప్రపంచంలో మనకు తెలియని ప్రాణులు ఎన్నో ఉంటాయి. కొన్నింటి గురించి తెలిసినపుడు ఆశ్చర్యం వేస్తుంది. సాధారణంగా పురుగులు,పాములు పేర్లు తలచుకున్నప్పుడు అదొక జుగుప్స కలుగుతుంది. కానీ చాలా అరుదైన జీవులు ఉంటాయి. కొన్ని అదృష్టానికి మారుపేరు అవుతాయి. అలాంటిదే స్టాగ్ బీటిల్(Stag beetle). ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పురుగుగా గుర్తించబడింది. దీన్ని పెంచుకోవడం వల్ల అదృష్టం కలిసొస్తుందని చాలామంది నమ్ముతారు. వీటిని సాధారాణ మార్కెట్లో అయితే లక్షల్లో అమ్ముతారు, కానీ బ్లాక్ మార్కెట్ లో ఏకంగా కోట్ల రూపాయల ధర పలుకుతోంది. నలుపు, చాక్లెట్ రంగులో ఉండే ఈ స్టాగ్ బీటిల్ రెండు నుండి మూడు అంగుళాల పరిమాణంలో ఉంటుంది. దీనికి ముందు భాగంలో కొమ్ములు పొడవుగా ఉంటాయి.చూడగానే 'అమ్మో ఏం చేస్తుందో..' అని కాస్త భయపెడుతుంది. కానీ ఈ పురుగును అనేక రకాల మందులను తయారుచేయడంలో ఉపయోగిస్తారట. అందుకే ఇది ఇంత ఖరీదు పలుకుతోందని అంటున్నారు. కాగా ఈ స్టాగ్ బీటిల్ చాలా అరుదైన పురుగు, చలికాలంలో ఎక్కువగా మరణించే ఈ పురుగు ప్రస్తుతం అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉందని చెబుతున్నారు.

Read also: తాళి కట్టే సమయానికి వరుడి పరిస్థితి చూసి నేరుగా పోలిస్ స్టేషన్ కు వెళ్ళిన వధువు.. అతను ఏం చేశాడంటే..


Updated Date - 2023-03-12T13:16:00+05:30 IST