Indian Railway: రైల్లో సీట్లోంచి సడన్‌గా లేచిన 19 ఏళ్ల కుర్రాడు.. ఎదురుగా కూర్చున్న దంపతులనే చూస్తూ.. అందరూ చూస్తుండగానే..!
ABN, First Publish Date - 2023-10-07T19:36:04+05:30
ప్రయాణ సమయాల్లో మందుబాబుల వల్ల వివిధ రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. కొందరు ఫుల్‌గా తాగి ఎదుటి వారితో కావాలనే గొడవలు పెట్టుకుంటుంటే.. మరికొందరు ఏకంగా పడుకున్న వారిపై...
ప్రయాణ సమయాల్లో మందుబాబుల వల్ల వివిధ రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. కొందరు ఫుల్‌గా తాగి ఎదుటి వారితో కావాలనే గొడవలు పెట్టుకుంటుంటే.. మరికొందరు ఏకంగా పడుకున్న వారిపై మూత్రం కూడా పోస్తుంటారు. ఇటీవల విమానాల్లో సైతం మహిళలపై మూత్రం పోసిన ఘటనలు చూశాం. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రైల్లో సీట్లోంచి సడన్‌గా లేచిన 19 ఏళ్ల కుర్రాడు.. చివరకు ఎదురుగా కూర్చున్న దంపతులను చూస్తూ.. అంతా చూస్తుండగానే దారుణానికి పాల్పడ్డాడు. చివరికి ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఝాన్సీ రైల్వే జంక్షన్‌లో (Jhansi Railway Junction) ఈ ఘటన చోటు చేసుకుంది. సంపర్క్ క్రాంతి రైలు (Sampark Kranti Express) బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి విరంగన లక్ష్మీబాయి ఝాన్సీ జంక్షన్ వైపు వెళ్లోంది. ఈ రైలు బి-3 కోచ్‌లో ఇద్దరు వృద్ధ దంపతులు పడుకుని ఉన్నారు. కాగా, ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల రితేష్ అనే యువకుడు మహోబా స్టేషన్‌లో ఇదే రైలు ఎక్కాడు. అప్పటికే అతను ఫుల్‌గా మద్యం తాగి ఉన్నాడు. వృద్ధ దంపతులు కూర్చున్న సీటు పక్కనే కూర్చున్న అతను.. కాసేపటి తర్వాత లేచాడు. తర్వాత అతను నేరుగా వెళ్లి వృద్ధులపై (young man urinated on elderly couple) మూత్రం పోశాడు. ఊహించని ఈ ఘటనతో వృద్ధ దంపతులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Shocking Video: ఈ స్కూల్లో అమ్మాయిలకు ఏమైంది..? ఒకేసారి 95 మందికి పక్షవాతం.. నడవలేని స్థితిలో..!
జరిగిన దారుణంపై వృద్ధులు టీటీఈకి ఫిర్యాదు చేశారు. దీంతో అతను ఈ ఘటనపై ఝాన్సీలోని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు సమాచారం అందించారు. అనంతరం కోచ్‌ను శుభ్రం చేయించారు. రైలు ఝాన్సీ జంక్షన్ చేరుకోగానే యువకుడిని రైల్వే పోలీసులకు అప్పగించారు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేశారు. అయితే తర్వాత అతడికి జరిమానా విధించి విడుదల చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పురరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2023-10-07T19:36:04+05:30 IST