కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Snake Video: ఇంటి ముందు వంట చేసుకుంటున్న మహిళ.. వెనుక నుంచి వచ్చి ఆమె కుర్చీ కిందకు దూరిన పాము.. చివరకు..!

ABN, First Publish Date - 2023-09-21T14:53:04+05:30

విష సర్పాల జోలికి మనం పోనంతవరకూ అవి మనల్ని ఏమీ చేయవు. పొరపాటున వాటితో ఆడుకోవాలని చూస్తే.. తమని తాము రక్షించుకునే క్రమంలో వెంటనే కాటేస్తుంటాయి. కొందరు కావాలనే పాములతో పరాచకాలు ఆడుతూ వాటి సహనాన్ని పరీక్షిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది...

Snake Video: ఇంటి ముందు వంట చేసుకుంటున్న మహిళ.. వెనుక నుంచి వచ్చి ఆమె కుర్చీ కిందకు దూరిన పాము.. చివరకు..!

విష సర్పాల జోలికి మనం పోనంతవరకూ అవి మనల్ని ఏమీ చేయవు. పొరపాటున వాటితో ఆడుకోవాలని చూస్తే.. తమని తాము రక్షించుకునే క్రమంలో వెంటనే కాటేస్తుంటాయి. కొందరు కావాలనే పాములతో పరాచకాలు ఆడుతూ వాటి సహనాన్ని పరీక్షిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. అయితే ఇంకొందరు మాత్రం తమకు తెలీకుండానే పామును కాలితో తొక్కడమో, తాకడమో చేసి.. వాటి దాడికి గురవుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ మహిళ ఇంటి ముందు వంట చేసుకుంటుండగా.. పెద్ద కింగ్ కోబ్రా సడన్‌గా ఆమె కుర్చీ కింద దూరింది. చివరకు ఆ పాము ఏం చేసిందో చూడండి...

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. థాయ్‌లాండ్‌లో ఓ మహిళకు (Thailand woman) షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ మహిళ తన ఇంటి వరండాలో వంట చేస్తూ ఉంది. కుర్చీలో కూర్చుని ఏదో పిండి కలుపుకొంటూ ఉండగా.. అనూహ్య ఘటన చోటు చేసుకుంటుంది. ఓ పెద్ద కింగ్ కోబ్రా పాము (King cobra) పక్కన ఉన్న చెట్ల పొదల్లో నుంచి నేరుగా మహిళ ఇంటి వైపు వస్తుంది. వస్తూ వస్తూ ఏకంగా మహిళ కూర్చున్న కుర్చీ కిందకు దూసుకొస్తుంది. అప్పటిదాకా తన లోకంలో తాను పిండి కలుపుకొంటున్న మహిళ.. పాము సడన్‌గా రావడం చూసి షాక్ అవుతుంది. ఆ కంగారులో ఆమె కాలు పాముకు తాకుతుంది. దీంతో ముందుకు వెళ్లే పాము కాస్త.. ఉన్నట్టుండి వెనక్కు తిరిగి (Snake attack on woman) ఆమెపై బుసలు కొడుతోంది.

Crime news: అప్పటిదాకా కలిసున్న ప్రియురాలు.. ప్రియుడి చర్మంలో సమస్య ఉందని తెలియడంతో.. చివరకు ఏం చేసిందంటే..

అయితే అప్పటికే అలెర్ట్ అయిన మహిళ.. పాము కాటు నుంచి తెలివిగా తప్పించుకుని అక్కడి నుంచి పరుగెత్తుకుంటూ పక్కకు వెళ్లిపోతుంది. మరోవైపు పాము కూడా అక్కడి నుంచి రోడ్డు పక్క చెట్ల పొదల్లోకి వెళ్లిపోతుంది. మహిళ అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. కాగా, ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. అంటే ఇదేనేమో’’.. అంటూ కొందరు, ‘‘వంట వాసన పామును ఆకట్టుకున్నట్లుంది’’.. అని మరికొందరు, ‘‘ఈ మహిళ టైం బాగుంది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఇది స్కూటీ కాదమ్మాయ్.. బుల్లెట్ బండి.. కిక్ కొట్టడం అంత ఈజీ కాదంటూ నెట్టింట సెటైర్లు.. ఇంతకీ అసలేమైందంటే..!

Updated Date - 2023-09-21T14:53:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising