ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: హైకోర్టు ముందుకు అరుదైన కేసు.. మొదటి భర్తకు గుడ్‌బై చెప్పి.. రెండో పెళ్లి చేసుకున్నాక.. ఆ భార్య చేసిన నిర్వాకంతో..!

ABN, First Publish Date - 2023-07-25T18:31:08+05:30

ప్రేమ వ్యవహారాలు కొన్నిసార్లు చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతుంటాయి. ఇంకొన్నిసార్లు సినిమా తరహా ట్విస్టులు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఘటనలో వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే భార్య మొదటి భర్తకు గుడ్‌బై చెప్పి రెండో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో...

ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ వ్యవహారాలు కొన్నిసార్లు చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతుంటాయి. ఇంకొన్నిసార్లు సినిమా తరహా ట్విస్టులు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఘటనలో వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే భార్య మొదటి భర్తకు గుడ్‌బై చెప్పి రెండో పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలో మొదటి భర్త హైకోర్టును ఆశ్రయించాడు. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ అరుదైన కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ముంబైకి (Mumbai) చెందిన 20ఏళ్ల యువకుడికి.. ఇదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికతో (girl) రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొన్నాళ్లకే ప్రేమగా (love) మారింది. ఈ క్రమంలో 2021 ఆగస్ట్‌లో బాలిక గర్భం (pregnancy) దాల్చింది. ఈ విషయం ఇంట్లో తెలిస్తే సమస్య అవుతుందని భావించిన వారు.. ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనంతరం వేరే రాష్ట్రానికి వెళ్లి పెళ్లి (love marriage) చేసుకున్నారు. మరోవైపు తన కూతురును యువకుడు కిడ్నాప్ చేసినట్లు బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలావుండగా, 2021 నవంబర్‌లో బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. తర్వాత కొన్నిరోజులకే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బాలికతో పాటూ బిడ్డను సీడబ్ల్యూసీకి అప్పగించారు.

Viral: వివాహమైన మరుసటి రోజే వధువుకు ఊహించని సమస్య.. శోభనం గదిలోకి సోదరుడితో కలిసి వెళ్లిన భర్త.. చివరకు..

అయితే ఈ క్రమంలో బాలిక తండ్రి ఆమెకు రెండో వివాహం చేశాడు. బిడ్డను మాత్రం సీడబ్ల్యూసీ (child welfare committee) ఆధ్వర్యంలోనే ఉంచారు. ఇటీవల సీడబ్ల్యూసీ అధికారులు బిడ్డను వేరే వారికి దత్తత ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువకుడు.. తన కొడుకును తనకే అప్పగించాలని సీడబ్ల్యూసీని ఆశ్రయించాడు. బిడ్డ తల్లి కూడా ఇందుకు అంగీకరించినా.. అధికారులు మాత్రం తండ్రి అభ్యర్థనను పరిగణలోకి తీసుకోలేదు. దీంతో తండ్రి చివరకు హైకోర్టును ఆశ్రయించాడు. విచారించిన న్యాయస్థానం సీడబ్ల్యూసీ వ్యవహార శైలిపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సీడబ్ల్యూసీ వైఖరి దురదృష్టకమరని పేర్కొంది. సంబంధింత అధికారులు బుధవారం కోర్టులో (Court) హాజరుకావాలని ఆదేశించింది. దీనిపై చివరకు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. కాగా, ఈ వార్త ప్రస్తుతం అటు స్థానికంగానూ, ఇటు సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.

Lift: కష్టపడకుండానే కోట్లు సంపాదించాలి.. ఇదీ ఈ దంపతుల ప్లాన్.. నడిరోడ్డుపై భార్యను ఒంటరిగా వదిలేసి భర్త పక్కా స్కెచ్..!

Updated Date - 2023-07-25T18:31:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising