Mahabalipuram: మీకు విషపు చేపల గురించి తెలుసా.. అవి ఎలా ఉంటాయంటే..
ABN , First Publish Date - 2023-07-05T09:18:01+05:30 IST
రెండు రోజులుగా చేపలవేటకు వెళ్లిన మహాబలిపురం(Mahabalipuram) జాలర్లకు తీవ్ర నిరాశే మిగింది. సముద్రంలో ఐదారు నాటికల్ మైళ్ల దూ
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రెండు రోజులుగా చేపలవేటకు వెళ్లిన మహాబలిపురం(Mahabalipuram) జాలర్లకు తీవ్ర నిరాశే మిగింది. సముద్రంలో ఐదారు నాటికల్ మైళ్ల దూరంలో మర పడవలలో వెళ్ళి జాలర్లు విసిరిన వలల్లో విషపు చేపలే పడ్డాయి. ఈ చేపల వంటి నిండా విషపు ముల్లులు ఉన్నాయి. ఆ ముళ్లు గుచ్చుకుంటే గాయాలు త్వరగా మానవని చెబుతున్నారు. ‘పలాసి’ అనే పేరుతో పిలుస్తున్న ఈ చేపలు మహాబలిపురం జాలర్ల వలలో మెండుగా లభించాయి. ఆ చేపలను జాలర్లు సముద్రపు ఒడ్డున పారవేశారు. అలా విసిరేసిన ఆ చేపల ముళ్లు తీరం వెంబడి వాకింగ్‌కు వెళ్లే వారికి గుచ్చుకుంటాయని స్థానికులు చెబుతున్నారు. పురపాలక సంఘం అధికారులు ఆ చేపలను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.