Wife: కట్టుకున్న భార్యను అసభ్యంగా వర్ణిస్తూ ఫ్రెండ్స్‌తో ఓ భర్త చాటింగ్.. సడన్‌గా ఓ రోజు ఆ నీచాన్ని భార్య చూడటంతో..!
ABN, First Publish Date - 2023-10-17T12:18:54+05:30
అప్పుడప్పుడు బయటకు వచ్చే కొన్ని సంఘటనలు చూస్తుంటే.. సమాజంలో ఇలాంటి వారు కూడా ఉంటారా? అని అనిపించకమానదు. సభ్యసమాజం తలదించుకునే అలాంటి సంఘటనలు ఇటీవలి కాలంలో తరచూ చోటు చేసుకోవడం దురదృష్టకరమనే చెప్పాలి.
అప్పుడప్పుడు బయటకు వచ్చే కొన్ని సంఘటనలు చూస్తుంటే.. సమాజంలో ఇలాంటి వారు కూడా ఉంటారా? అని అనిపించకమానదు. సభ్యసమాజం తలదించుకునే అలాంటి సంఘటనలు ఇటీవలి కాలంలో తరచూ చోటు చేసుకోవడం దురదృష్టకరమనే చెప్పాలి. కొందరు మానవత్వం మరిచి మృగాళ్లుగా మారుతున్నారు. ఇలాంటి ఘటన ఒకటి తాజాగా కర్నాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. ఏడు అడుగులు నడిచి, అగ్నిసాక్షిగా పరిణయమాడిన భార్యను తన స్నేహితులతో పడక పంచుకోవాలని వేధిస్తున్నాడో మృగాడు. అది నేను చేయలేనని ఎంత చెప్పిచూసిన ఆమె మాట వినలేదు సరికదా.. ఇంకా అతడి అకృత్యాలు ఎక్కువయ్యాయి. ఇక చేసేదేమీలేక భార్య పోలీసులను ఆశ్రయించింది. దాంతో ఈ అమానవీయ సంఘటన వెలుగులోకి వచ్చింది.
బెంగళూరులోని అమృతహల్లీ పోలీస్ స్టేషన్‌లో ఈ సంఘటనపై తాజాగా కేసు నమోదైంది. ఈ కేసులో పేర్కొన్న సమాచారం ప్రకారం... ఆ జంటకు 2007లో వివాహామైంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా. 16ఏళ్ల వారి వివాహ బంధం సాఫీగానే గడిచింది. ఈ క్రమంలో ఒకరోజు భర్త గురించి భార్యకు షాకింగ్ విషయం తెలిసింది. అనుకోకుండా భర్త వాట్సాప్ చాట్ చూసిన ఆమెకు గుండె ఆగినంత పనయింది. కట్టుకున్న భార్యను అసభ్యంగా వర్ణిస్తూ ఫ్రెండ్స్‌తో భర్త చాటింగ్ చేయడం చూసి ఆమె నిర్ఘాంతపోయింది. అంతేగాక వేశ్యాలతో కూడా భర్త చాట్ చేయడం అందులో ఉంది. ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగితే.. ఆమెను చంపేస్తానని బెదిరించాడు.
దాంతో వేరే గత్యంతరం లేక భర్త అకృత్యాలను తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లిందామె. ఇరువురి కుటుంబాలు కలిపించుకుని అలా చేయొద్దని అతడిని సర్ధి చెప్పి వెళ్లిపోయారు. కానీ, అతడి ప్రవర్తనలో మార్పురాలేదు. మళ్లీ వేశ్యాల వద్దకు వెళ్లడం, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. మరోసారి ఇరు కుటుంబాలు సర్ది చెప్పాయి. అలా కొన్నిరోజులు బాగానే ఉన్న అతగాడు.. మరోసారి తనలోని మృగాడిని నిద్రలేపాడు. ఈసారి ఏకంగా భార్యను తన స్నేహితులతో పక్క పంచుకోవాల్సిందేనని వేధించడం మొదలెట్టాడు. దాంతో చేసేదేమీలేక ఆమె అమృతహల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్తపై పోలీసులు గృహ హింస కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Wife-Husband: వంట చేయడం లేదని కూడా విడాకులు.. విడిపోయేందుకు ఈ తరం భార్యాభర్తలు చెబుతున్న వింత కారణాలు ఇవేనట..!
Updated Date - 2023-10-17T12:19:02+05:30 IST