ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Train Accident: రైల్వే స్టేషన్‌లో షాకింగ్ సీన్.. ప్లాట్ ఫామ్‌పై ఓ వ్యక్తిని ఈడ్చుకెళ్లిన రైలు.. చనిపోవడం ఖాయమనే అంతా అనుకున్నారు కానీ..!

ABN, First Publish Date - 2023-06-22T17:10:52+05:30

ప్రయాణ సమయాల్లో అప్పుడప్పుడూ అద్భుతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే మరికొన్నిసార్లు ఎంత పెద్ద ప్రమాదం జరిగినా క్షేమంగా బయటపడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రయాణ సమయాల్లో అప్పుడప్పుడూ అద్భుతాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగినా ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే మరికొన్నిసార్లు ఎంత పెద్ద ప్రమాదం జరిగినా క్షేమంగా బయటపడుతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం రైలు ప్రమాదానికి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందపడ్డ వ్యక్తి చాలా దూరం ఈడ్చుకుంటూ వెళ్లాడు. చనిపోవడం ఖాయమనే అంతా అనుకున్నారు. కానీ చివరకు ఏం జరిగిందంటే..

యూపీలోని (UP) షాజహాన్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్‌లో (Shahjahanpur railway station) ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులంతా రైలు కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఇంతలో పాటలీపుత్ర ఎక్స్‌ప్రెస్ (Pataliputra Express) గంటకు 110 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది. ఆ రైలు ఈ స్టేషన్‌లో ఆగదు కాబట్టి వేగంగా దూసుకెళ్లింది. అయితే ఆ సమయంలో చోటు చేసుకున్న అనూహ్య ఘటనకు అక్కడున్న ప్రయాణికులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వేగంగా వెళ్తున్న రైలు నుంచి ఓ యువకుడు (young man fell from the train) జారి ప్లాట్‌ఫామ్‌పై పడ్డాడు. పడగానే రైలుతో సమానంగా వేగంగా ఈడ్చుకెళ్లాడు. సుమారు వంద మీటర్ల మేర అలాగే జారుతూ వెళ్లాడు. అయితే అంత వేగంగా వెళ్తున్న రైలు నుంచి పడ్డా యువకుడికి ఎలాంటి ప్రమాదమూ జరగలేదు.

Viral News: అట్టముక్కలు అమ్మకునే ఇతడు.. రతన్ టాటాకు ఏమాత్రం తీసిపోడు.. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే..!

ఈడ్చుకుంటూ వెళ్లిన యువకుడు తర్వాత పైకి లేచి నిలబడడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సదరు యువకుడు ఏమాత్రం ప్లాట్‌ఫామ్‌కు, రైలుకు మధ్యలో పడి ఉన్నా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. అయితే అదృష్టవశాత్తు అతడికి ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఇతడికి భూమ్మీద నూకలు ఇంకా మిగిలి ఉన్నాయ్’’.. అరని కొందరు, ‘‘నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇలాగే జరుగుతుంది’’.. అని మరికొందరు, ‘‘వామ్మో! నిజంగా నమ్మలేకున్నాం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 70వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఓరి దేవుడో.. ఇదేం మాయాజాలం.. ఈ ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడు.. ఆ యువతి ఎవరో కాదండోయ్..!

Updated Date - 2023-06-22T17:10:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising