గూగుల్, కాఫీ... ఇవి మనుషుల పేర్లు... ఇలాంటి పేర్లు గలవారు ఎక్కడుంటారంటే...
ABN , First Publish Date - 2023-03-18T12:25:13+05:30 IST
గూగుల్(Google)లో మనకు కావలసిన సమాచారాన్ని వెదుకుతుంటాం. ప్రతీరోజూ ఉదయాన్నే కాఫీ(Coffee) తాగుతుంటాం.

గూగుల్(Google)లో మనకు కావలసిన సమాచారాన్ని వెదుకుతుంటాం. ప్రతీరోజూ ఉదయాన్నే కాఫీ(Coffee) తాగుతుంటాం. అయితే దేశంలోని కొందరి పేర్లు గూగుల్, కాఫీ అని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే(surprised). ఇది వినడానికి వింత(strange)గా అనిపించినప్పటికీ, దేశంలోని కొందరికి ఇటువంటి పేర్లు ఉన్నాయి.
గూగుల్, కాఫీ అనే పేర్లు కలిగినవారు కర్ణాటక(Karnataka)కు చెందినవారు. వారి తెగ హిక్కీ-పిక్కి. తమ పిల్లలకు వారు ఇలాంటి పేర్లు పెడతారు. ఇదేవిధంగా ఎలిజబెత్, మైసూర్, అమితాబ్(Amitabh), షారుక్ అనే పేర్లు కూడా పెడతారు. హిక్కి-పిక్కి తెగ జీవనోపాధి కోసం వేటపై ఆధారపడుతుంటుంది. ఈ తెగకు చెందినవారు దేశవ్యాప్తంగా తిరుగుతూ జీవనోపాధి(Livelihood) కోసం వేటాడుతుంటారు.
వారు కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, ఇతర భాషలలో మాట్లాడుతుంటారు. మీడియా కథనాల ప్రకారం, ఈ తెగ ప్రజలకు అధికారిక రికార్డులు(Records) లేవు. అయితే వారికి ఓటరు గుర్తింపు కార్డు(Voter Identity Card) ఉండటం విశేషం.