ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్న ఈ మహిళ.. సడన్ గా వైరల్ అవడం వెనుక..!

ABN, First Publish Date - 2023-09-02T16:24:08+05:30

ప్రస్తుతం పల్లెల నుంచి పట్టణాలు, నగరాలు.. ఇలా ఎక్కడ చూసినా ఆన్‌లైన్ క్రయవిక్రయాలు పెరిగిపోయాయి. వంద నుంచి వేలు, లక్షల రూపాయల వరకూ ఎలాంటి వస్తువులనైనా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టేస్తున్నారు. మరోవైపు ఇంటి నుంచి బయటికి వెళ్లినా కూడా టీ దగ్గర నుంచి కూరగాయల వరకూ ప్రతి దానికీ..

ప్రస్తుతం పల్లెల నుంచి పట్టణాలు, నగరాలు.. ఇలా ఎక్కడ చూసినా ఆన్‌లైన్ క్రయవిక్రయాలు పెరిగిపోయాయి. వంద నుంచి వేలు, లక్షల రూపాయల వరకూ ఎలాంటి వస్తువులనైనా ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ పెట్టేస్తున్నారు. మరోవైపు ఇంటి నుంచి బయటికి వెళ్లినా కూడా టీ దగ్గర నుంచి కూరగాయల వరకూ ప్రతి దానికీ ఆన్‌లైన్ పేమేంట్ చేయడం చూస్తున్నాం. ఏ వ్యాపారి వద్దకు వెళ్లినా.. ముందుగా ‘‘ మీ షాపులో పేటీఎం, ఫోన్ పే ఉందా’’.. అని అడుగుతుంటాం. దీంతో ప్రతి ఒక్క వ్యాపారీ వారి వారి దుకాణాల్లో క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆఖరికి చదువురాని వారు కూడా ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. కూరగాయలు విక్రయిస్తున్న మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మహారాష్ట్రకు (Maharashtra) చెందిన ఓ మహిళ (woman) రోడ్డు పక్కన కూరగాయలు, వేరుశెనగలు తదితరాలను (Selling vegetables) విక్రయిస్తూ ఉంటుంది. అయితే ఈమె చేసిన చిన్న పని ప్రస్తుతం కొన్ని లక్షల మంది దృష్టిలో పడింది. రద్దీగా ఉన్న రోడ్డు పక్కన ఓ మహిళ వివిధ రకాల కూరగాయలు, వేరుశెనగలను విక్రయిస్తుంటుంది. చాలా మంది ఆమె వద్ద వారికి కావాల్సినవి కొనుక్కెళ్తుంటారు. ఇందులో ఎలాంటి విశేషం లేకున్నా.. ఆమె చేసిన చిన్న పని అందరినీ ఆకట్టుకుంది. ఓ వ్యక్తి ఆమె వద్ద కూరగాయలు తీసుకున్నాక.. ‘‘ఫోన్ పే, పేటీఎం వంటివి లేవా అమ్మా’’.. అని అడుగుతాడు. ఇందుకు ఆమె ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఎందుకు లేవూ.. ఇదిగో అంటూ పక్కనే వేయింగ్ మిషన్‌పై కూరగాయలు తూచే పాత్రను తీసుకుని తలకిందులుగా చేసి చూపిస్తుంది.

Viral: ప్రియుడు వంట చేస్తోంటే.. సాయంగా వెళ్లడమే ఆ ప్రేయసి పొరపాటయింది.. దాన్ని వాసన చూడటంతో..!

పాత్ర కింద పేటీఎం క్యూఆర్ కోడ్ (Paytm QR Code) స్టిక్కర్ అతికించి ఉండడం చూసి సదరు యువకుడు షాక్ అవుతాడు. క్యూఆర్ కోడ్ ఎక్కడ ఉందబ్బా.. అని వెతికిన వారంతా చివరికి ఇలా చూసేసరికి షాక్ అవుతున్నారు. ఈ ఘటనను సదరు వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అదీ ఎంతలా అంటే ఇప్పటికే ఈ వీడియో మిలియన్‌కి పైగా వ్యూస్, లైక్‌లను సొంతం చేసుకుంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె తెలివికి హ్యాట్సాప్’’.. అంటూ కొందరు, ‘‘ఈ అవ్వ టెక్నాలజీకి బాగా ఆప్‌డేట్ అయింది’’.. అని మరికొందరు, ‘‘చాలా మంది వ్యాపారస్తులు ఇలాగే చేస్తారు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఏనుగు పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. అంతెత్తున ఉన్న పనస పండ్లను ఎలా తెంచేసిందో చూడండి..

Updated Date - 2023-09-02T16:24:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising