Shocking Video: చెల్లి మృతదేహాన్ని చున్నీతో కట్టుకుని.. బైక్‌పైనే ఇంటికి తీసుకెళ్లిన అన్న..!
ABN, First Publish Date - 2023-11-08T18:36:09+05:30
కాస్త ముందు, వెనక తప్పితే.. పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదు. అయితే ఈ మరణం అనేది ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉంటుంది. కొందరు చిన్న వయసులోనే అకాల మరణానికి గురై.. కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతుంటారు. ఇంకొందరైతే అప్పటిదాకా ...
కాస్త ముందు, వెనక తప్పితే.. పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక తప్పదు. అయితే ఈ మరణం అనేది ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా ఉంటుంది. కొందరు చిన్న వయసులోనే అకాల మరణానికి గురై.. కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతుంటారు. ఇంకొందరైతే అప్పటిదాకా సంతోషంగా ఉంటూ.. ఉన్నట్టుండి మృత్యు ఒడిలోకి జారుకుంటుంటారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు కఠినాత్ములు కూడా కన్నీటిపర్యంతమవుతుంటారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. చెల్లి మృతదేహాన్ని చున్నీతో కట్టుకుని బైకుపైనే ఇంటికి తీసుకెళ్లాడు. ఈ ఘటన చూసిన ప్రతి ఒక్కరూ అయ్యో పాపం! ఎంత ఘోరం అంటూ కన్నీరుపర్యంతమవుతున్నారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఔరైయా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక బిదునా నగర్ పరిధి కిష్నీ రోడ్ ఈస్ట్ నవీన్ బస్తీకి చెందిన అంజలి (19) ఉన్నట్టుండి ఊహించని ప్రమాదానికి గురై మృతి చెందింది. ఇటీవల ఓ రోజు ఆమె వారి ఇంటికి సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా (young woman was electrocuted).. విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే సమయానికి అంబులెన్స్‌తో పాటూ వేరే ఇతర వాహనాలు అందుబాటులో లేకపోవడంతో చివరకు అంజలి సోదరుడు ఒక్కడే తన బైకుపై తీసుకెళ్లాడు.
Shocking Video: గ్యాస్ సిలిండర్‌ను కట్ చేసి చూస్తే.. కుప్పలు కుప్పలుగా బయటపడ్డ డబ్బు..!
అపస్మారక స్థితిలో ఉన్న చెల్లెలిని బైకుపై కూర్చోబెట్టుకుని చున్నీతో కట్టుకుని తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే (Young woman died due to electric shock) ఆమె మృతి చెందిందని చెప్పారు. అప్పటివరకూ తమ మధ్య సంతోషంగా తిరిగిన అంజలి.. ఊహించని విధంగా మృత్యువాత పడడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. అమ్మా! లేవమ్మా.. ఒక్కసారి అన్నా!.. అని పిలువమ్మా.. అని అంజలి సోదరుడు ఏడుస్తూ పిలవడం చూసి అక్కడున్న వారంతా కన్నీటిపర్యంతమయ్యారు. చివరకు చేసేదేమీలేక అంజలి మృతదేహాన్ని బైకుపైనే స్వగ్రామానికి తీసుకెళ్లారు.
అయితే ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ఆరోపించారు. వైద్యాధికారులు కనీసం అంబులెన్స్ కూడా పంపించలేదని మండిపడ్డారు. కాగా, ఈ ఘటనపై డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ స్పందించారు. వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. అయితే, అంబులెన్స్ కావాలని తమను ఎవరూ అడగలేదని, వారి ఇష్టానుసారమే బైకులో తీసుకెళ్లారని వైద్యాధికారులు చెబుతున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.
Updated Date - 2023-11-08T18:36:10+05:30 IST