Viral Photo: మాజీ ప్రియురాలు చేసిన పనికి ఖంగుతిన్న ప్రియుడు.. ఒకే ఒక్క టెక్నిక్‌తో ఎలా రివేంజ్ తీర్చుకుందంటే..
ABN , Publish Date - Dec 16 , 2023 | 08:48 PM
ప్రేమికులు కలిసి ఉన్నంత వరకూ ఒకరికోసం ఇంకొకరు అన్నట్లుగా ఉంటారు. అయితే ఇలాంటి వారిలో చాలా మంది తమ స్వార్థం కోసం పైకి ప్రేమగా నటిస్తుంటారు. అవసరం తీరాక దారుణంగా మోసం చేస్తుంటారు. మరికొందరు...
ప్రేమికులు కలిసి ఉన్నంత వరకూ ఒకరికోసం ఇంకొకరు అన్నట్లుగా ఉంటారు. అయితే ఇలాంటి వారిలో చాలా మంది తమ స్వార్థం కోసం పైకి ప్రేమగా నటిస్తుంటారు. అవసరం తీరాక దారుణంగా మోసం చేస్తుంటారు. మరికొందరు ఏవేవో కారణాలు చూపుతూ లవ్‌కి బ్రేకప్ చెబుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొందరు రివేంజ్ తీర్చుకుంటుంటారు. తాజాగా, ఓ యువతి చేసిన పని చూసి ఆమె ప్రియుడితో పాటూ అంతా అవాక్కవుతున్నారు. ఒకే ఒక్క టెక్నిక్‌తో ఆమె తన ప్రియుడిపై ఎలా పగ తీర్చుకుందంటే..
న్యూయార్క్‌కు (New York) చెందిన మడేలిన్ అనే యువతికి (young woman) మరో యువకుడి మధ్య చాలా కాలం పాటు ప్రేమాయణం సాగింది. అయితే తర్వాత ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఉన్నట్టుండీ ఇద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి యువతి తన మాజీ ప్రియుడికి (ex boyfriend) ఏదో రకంగా జలక్ ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉండేది. ఈ క్రమంలో ఆమెకు ఓ ఐడియా వచ్చింది. AI టెక్నాలజీని (AI technology) ఉపయోగించి తన మాజీ ప్రియుడికి షాక్ ఇవ్వాలనుకుంది. ముందుగా ఆమె తన ఫోన్‌లో సెల్ఫీ తీసుకుంది.
తర్వాత AI టెక్నాలజీ సాయంతో ఆమె పక్కన ఓ యువకుడిని క్రియేట్ చేసింది. తన భుజం మీద తల పెట్టి ప్రేమగా ఉన్నట్లుగా ఫొటోను క్రియేట్ చేసింది. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఇదంతా తాను సరదాగా చేశానని చెప్పింది. ఇంటర్నెట్‌లో కనిపించేవన్నీ నిజం కావనే సందేశాన్ని ఇవ్వడం కోసం ఇలా చేసినట్లు ఆమె వివరణ ఇచ్చింది. కాగా, ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఏఐ టెక్నాలజీ ఎంత పని చేసింది’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో! నిజంగానే మనిషి ఉన్నట్లుందే’’.. అంటూ మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.