ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Train Driver: ఆ లోకోపైలెట్‌కు అదే చివరి పనిదినం అని తెలిసి.. ఈ రైలు ప్రయాణీకులంతా ఏం చేశారో చూడండి..!

ABN, First Publish Date - 2023-09-07T17:38:59+05:30

స్కూలు మాస్టారు ఉద్యోగ విరమణ చేస్తున్నారంటే విద్యార్థులకు ఎక్కడా లేని బాధ పొంగుకొస్తుంటుంది. ఇప్పుడంటే తక్కువ గానీ.. ఒకప్పుడు విద్యార్థులతో పాటూ ఊరు ఊరంతా కదిలొచ్చి మాస్టార్లకు ఘనంగా సన్మానం చేసి ఊరేగింపుగా తీసుకెళ్లి వీడ్కోలు పలికేవారు. అయితే..

స్కూలు మాస్టారు ఉద్యోగ విరమణ చేస్తున్నారంటే విద్యార్థులకు ఎక్కడా లేని బాధ పొంగుకొస్తుంటుంది. ఇప్పుడంటే తక్కువ గానీ.. ఒకప్పుడు విద్యార్థులతో పాటూ ఊరు ఊరంతా కదిలొచ్చి మాస్టార్లకు ఘనంగా సన్మానం చేసి ఊరేగింపుగా తీసుకెళ్లి వీడ్కోలు పలికేవారు. అయితే అంతటి అభిమానం ఈరోజుల్లోనూ అందరిపైనా ఉంటుందా అంటే.. నిజాయితీ, నిబద్ధతతో పని చేసే వారికి అలాంటి గౌరవ మర్యాదలు ఎప్పుడూ ఉంటాయనే చెప్పొచ్చు. అందుకు ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. లోకోపైలెట్‌ ఉద్యోగ విరమణ చేస్తున్నారని తెలుసుకున్న ప్రయాణికులు.. చివరకు ఏం చేశారో చూడండి..

ముంబై రైల్వే స్టేషన్‌లో (Mumbai Railway Station) ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్నేళ్లుగా పని చేస్తున్న ఓ లోకోపైలెట్‌కు (loco pilot) విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తాను రిటైర్డ్ అవుతున్నానని తెలుసుకుని చివరి రోజు అతడి మనసు ఎంతో భారంగా మారింది. ఆ రోజంతా గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. తన ఉద్యోగ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా పని చేసిన వైనాన్ని తలచుకుంటూ, మరోవైపు ఇకపై విధులకు రాలేననే బాధతోనే డ్యూటీ చేశాడు. విధులు ముగించుకున్న అతను రైలు నుంచి కిందకు దిగగానే ఎదురుగా గుంపులు గుంపులుగా జనం ఉన్నారు.

Wife-Husband: కూరగాయలు తెమ్మంటూ భర్తకు ఓ స్లిప్ ఇచ్చిందో భార్య.. ఆమె రాసింది చదివి నెట్టింట పేలుతున్న సెటైర్లు..!

అక్కడ ఏం జరుగుతుందో అని అర్థం చేసుకునేలోపే అంతా దగ్గరికి వచ్చి, దండలు వేసి ఘనంగా (Passengers honored the Loco Pilot) సన్మానించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులంతా ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకున్నారు. రోజూ తమను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చిన లోకోపైలెట్‌ను కౌగిలించుకుని ధన్యవాదాలు తెలియజేశారు. కొందరు సంతోషంతో డాన్సులు వేస్తూ లోకోపైలెట్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. లోకోపైలెట్‌ ఉద్యోగ విరమణ చేస్తే.. ప్రయాణికులు ఇంతమంది తరలిరావడం ఎప్పుడూ చూడలేదని అక్కడున్న వారంతా చర్చించుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కూడా భావోద్వేగంతో కూడిన కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఒకే బైక్‌పై ముగ్గురు అమ్మాయిలు.. పోలీస్ కానిస్టేబుల్ అడిగిన ప్రశ్నలకు.. ఈ యువతుల రెస్పాన్స్ వింటే..!

Updated Date - 2023-09-07T17:38:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising