ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: అభిమానం తలకెక్కితే.. ఇలాగే ఉంటుందేమో.. జవాన్ సినిమాలో షారూఖ్ స్టయిల్‌లో రైలెక్కిన అభిమాని.. చివరకు..!

ABN, First Publish Date - 2023-09-22T16:16:43+05:30

ఒకప్పుడు సినిమా తారలపై తమ అభిమానాన్ని బ్యానర్లు కట్టడం, పాలాభిషేకాలు చేయడం, చిత్రపటాలను ఘనంగా ఊరేగిచండం ద్వారా చూపించేవారు. అయితే మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో తమ అభిమానాన్ని వీడియోలు, రీల్స్ రూపంలో చూపిస్తున్నారు. కొందరు...

ఒకప్పుడు సినిమా తారలపై తమ అభిమానాన్ని బ్యానర్లు కట్టడం, పాలాభిషేకాలు చేయడం, చిత్రపటాలను ఘనంగా ఊరేగిచండం ద్వారా చూపించేవారు. అయితే మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో తమ అభిమానాన్ని వీడియోలు, రీల్స్ రూపంలో చూపిస్తున్నారు. కొందరు తమ అభిమాన హీరో పాటలకు డాన్సులు చేస్తూ, ఇంకొందరు డైలాగులు చెబుతూ... మరికొందరు ఏకంగా సినిమా సీన్లను మక్కీకి మక్కీ దింపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి స్పూఫ్ వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, సూపర్ హిట్ అయిన బాలీవుడ్ జవాన్ సినిమాలో షారూఖ్ మాదిరే ఓ వ్యక్తి రైలు ఎక్కే సీన్ చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘అభిమానం తలకెక్కితే.. ఇలాగే ఉంటుందేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ జవాన్ చిత్రం (Jawan movie) సంచలనం విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో షారూఖ్ (Shah Rukh Khan) అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. చాలా మంది ఈ సినిమాలోని పాటలకు డాన్సులు చేయడం, డైలాగులు చెప్పడం వంటి స్పూఫ్ వీడియోలతో (Spoof videos) రీల్స్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు ఇటీవల తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి షారూఖ్ వేషధారణలో రైలు ఎక్కే సీన్ చేశాడు. సినిమాలో షారూఖ్ చేసినట్లుగానే ఇతను కూడా తలకు, చేతులకు కట్లు కట్టుకుని రైల్వే స్టేషన్‌లోకి వెళ్లాడు.

Wife: మూడేళ్ల క్రితం నాటి సినిమా స్టోరీ.. రియల్‌లైఫ్‌లో రిపీట్.. అందరి ముందు భర్త తనను నవ్వులపాలు చేశాడని ఓ భార్య నిర్ణయమిదీ..!

రైల్వే ప్లాట్‌ఫామ్ బెంచ్‌పై కూర్చోవడంతో అక్కడున్న ప్రయాణికులంతా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఇలా బెంచ్‌పై కాసేపు కూర్చుని.. రైలు వచ్చి ఆగగానే సినిమాలోగానే మెల్లిగా కుంటుతూ బోగీలోకి వెళ్తాడు. చివరకు ఓ ఖాళీ సీట్‌లో పడుకుండిపోతాడు. ఇతన్ని చూసిన ప్రయాణికులంతా నవ్వుకుంటూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘బాగా చేశారు బ్రదర్’’.. అని కొందరు, ‘‘అభిమానం ఏకంగా తలకే ఎక్కేసింది’’.. అని మరికొందరు, ‘‘షారూఖ్ లాగే చేశారు.. సూపర్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో! ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. జిమ్ సెంటర్‌లో ఈ అమ్మాయి విన్యాసం చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Updated Date - 2023-09-22T16:16:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising