Skeleton: ఎముకల గూడులా మృతదేహం.. పక్కనే సగం కాలిన స్మార్ట్‌ఫోన్.. లోపల సిమ్ కార్డు మాత్రం సేఫ్.. అసలు ఆ శవం ఎవరిదో తెలిసి..!
ABN, First Publish Date - 2023-05-06T17:16:19+05:30
నేరాలకు పాల్పడే వారు.. పోలీసులకు సాక్షాలు దొరక్కుండా ఉండేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు సినిమాలు చూసి ప్రేరణ పొంది చివరకు అదే విధంగా దోపిడీలు, హత్యలు చేస్తుంటారు. ఇలాంటి కొన్ని కేసులు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. ఇలాంటి..
నేరాలకు పాల్పడే వారు.. పోలీసులకు సాక్షాలు దొరక్కుండా ఉండేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు సినిమాలు చూసి ప్రేరణ పొంది చివరకు అదే విధంగా దోపిడీలు, హత్యలు చేస్తుంటారు. ఇలాంటి కొన్ని కేసులు పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. ఇలాంటి కేసుకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఓ మృతదేహం పూర్తిగా కాలిపోయి ఎముకల గూడులా మారింది. దీంతో ఆ శవం ఎవరిదో కనుక్కునేందుకు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. అయితే మృతదేహం పక్కనే కాలిపోయిన స్మార్ట్‌ఫోన్ కనిపించింది. అందులో సిమ్ కార్డు సేఫ్‌గా ఉండడంతో చివరకు నిందితులను గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రైసెన్ జిల్లా కర్హౌలా గ్రామ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన పుష్పేంద్ర అనే వ్యక్తి ఓ రౌడీ షీటర్. ఇతడిపై వివిధ పోలీస్ స్టేషన్లలో గతంలో చాలా కేసులు నమోదై ఉన్నాయి. కాగా, ఇతడి కొన్నేళ్ల కిందట కాజల్ అనే యువతితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ (Love with a young woman) మొదలైంది. ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పి సహజీవనం (Live in relationship) చేసేవాడు. ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా.. వాయిదా వేస్తూ వచ్చేవాడు. ఇటీవల ఓ కేసులో కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే ఇంటికి వచ్చిన అతడు.. తన ప్రియురాలిపై అనుమానం పెంచుకున్నాడు.
20 ఏళ్ల తర్వాత అందిన సంతానం.. ఆ భార్యాభర్తలిద్దరి సంతోషం మూడు నెలల్లోనే ఆవిరి.. ఒకే ఒక్క ఘటనతో..
ఇన్నాళ్లూ ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకున్నావంటూ గొడవ పెట్టుకునేవాడు. ‘‘నాకు ఎవరితో సంబంధం లేదు.. ముందు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా చెప్పు’’.. అని యువతి నిలదీయడంతో మరింతం కోపం పెంచుకున్నాడు. ఇటీవల ఇదే విషయమై మళ్లీ గొడవ జరిగింది. చివరికి ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు ప్రియురాలితో కావాలనే గొడవపెట్టుకుని (Quarrel with girlfriend) ఉన్నట్టుండి ఆమెపై తన స్నేహితులతో దాడి చేసి హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని గుర్తుపట్టుకుండా ఉండేందుకు గ్రామ సమీపంలో పెట్రోల్ పోసి హత్య చేశారు.
మృతదేహం పూర్తిగా కాలేంత వరకూ ఉండి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరుసటి రోజు ఉదయం స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అయితే మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో గుర్తించేందుకు కష్టమైంది. ఈ క్రమంలో వారికి అక్కడే కాలిపోయిన ఓ ఫోన్ దొరికింది. అందులో సిమ్ భద్రంగా ఉండడంతో దాని సాయంతో నిందితులను గుర్తించారు. చివరకు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది.
Updated Date - 2023-05-06T17:16:19+05:30 IST