Teacher crime: కొత్తగా చేరిన మహిళా టీచర్‌పై.. కొన్నాళ్లకే వరుస ఫిర్యాదులు.. పట్టరాని కోపంతో చివరకు ఆమె చేసిన పని..
ABN, First Publish Date - 2023-10-14T18:27:21+05:30
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో కొందరు ఉపాధ్యాయులు కాస్తంత కఠినంగా వ్యవహరిస్తుంటారు. అప్పటికీ వారిలో మార్పు రాని పక్షంలో వారి తల్లిదండ్రులకు విషయం చెప్పి సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అయితే మరికొందరు టీచర్లు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా...
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే క్రమంలో కొందరు ఉపాధ్యాయులు కాస్తంత కఠినంగా వ్యవహరిస్తుంటారు. అప్పటికీ వారిలో మార్పు రాని పక్షంలో వారి తల్లిదండ్రులకు విషయం చెప్పి సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అయితే మరికొందరు టీచర్లు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా ముంబైలో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. పాఠశాలలో కొత్తగా చేరిన మహిళా టీచర్‌పై వరుస ఫిర్యాదులు వస్తుండేవి. దీంతో విద్యార్థులపై పట్టరాని కోపంతో చివరకు ఆమె చేసిన పని.. తల్లిదండ్రుల ఆగ్రహానికి కారణమైంది. వివరాల్లోకి వెళితే..
ముంబై (Mumbai) పరిధి థానేలోని డోంబివాలికి చెందిన జోందాలే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో (English medium school) ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో గణితం బోధించేందుకు ఓ మహిళా టీచర్ (female teacher) కొత్తగా చేరింది. చేరిన కొత్తలో ఎలాంటి సమస్య లేదు గానీ.. ఆమె పాఠాలు చెప్పే తీరు విద్యార్థులకు అసలు నచ్చలేదు. కొన్నాళ్లు ఓపికపట్టిన విద్యార్థులు.. చివరకు ఈ విషయాన్ని ఇంట్లో తెలియజేశారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని స్కూల్ యాజమాన్యానికి తెలియజేయడంతో ఈ విషయం సదరు టీచర్ వరకూ వెళ్లింది. అప్పటి నుంచి ఆమె విద్యార్థులపై కోపం పెంచుకుంది. రోజూ ఏదో ఒక సాకు (Teacher attack on students) చూపించి విద్యార్థులను తీవ్రంగా కొట్టేది.
ఇలా మొత్తం 80మంది విద్యార్థులపై తరచూ కర్రలు, ఇనుప రాడ్లతో కొడుతూ తన పగ తీర్చుకుంది. ఇటీవల వారిని తీవ్రంగా కొట్టడంతో బాధిత విద్యార్థులు ఇంటికి వెళ్లి.. తల్లిదండ్రులకు చెప్పి బోరున విలపించారు. పిల్లలను ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రుల కోపం కట్టలు తెంచుకుంది. స్థానికులతో కలిసి శుక్రవారం పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. సుమారు మూడు గంటల పాటు నిరసన తెలియజేశారు. విషయం పెద్దది కావడంతో సదరు ఉపాధ్యాయురాలిని ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పారు. చివరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టీచర్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Updated Date - 2023-10-14T18:27:57+05:30 IST