Viral news: సింహం వీడియో చూసి పరుగుపరుగున వెళ్లిన పోలీసులు.. చివరకు అతను ఇలా చేస్తాడని ఊహించలేదు..
ABN, First Publish Date - 2023-10-06T20:52:36+05:30
అదిగో పులి, ఇదిగో తోక.. అన్న సామెత చందంగా కొన్నిసార్లు కొందరు అసత్యాలను కూడా ఎంతో అందంగా, అంతా నమ్మి తీరేటట్లుగా ప్రచారం చేస్తుంటారు. అందులోనూ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చూపించడం చాలా సులభం. దీంతో..
అదిగో పులి, ఇదిగో తోక.. అన్న సామెత చందంగా కొన్నిసార్లు కొందరు అసత్యాలను కూడా ఎంతో అందంగా, అంతా నమ్మి తీరేటట్లుగా ప్రచారం చేస్తుంటారు. అందులోనూ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చూపించడం చాలా సులభం. దీంతో కళ్లతో చూసినా కూడా ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే.. తాజాగా, జరిగిన ఓ ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. సింహం సంచరించినట్లుగా ఉన్న వీడియో చూసి పోలీసులు పరుగుపరుగున వెళ్లారు. చివరకు యువకుడి అతి తెలివిని చూసి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్ర (Maharashtra) నాగ్‌పూర్‌లోని కాలమేశ్వర్ అటవీ ప్రాంత పరిధి మోహపా బిటా గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ప్రతాప్ అనే వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి.. సమీప అటవీ ప్రాతంలో సింహాన్ని చూశానని చెప్పాడు. దీనికితోడు వీడియో (lion video) తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన పోలీసుల అధికారులు పరుగు పరుగున సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సింహం సంచరించిన దాఖలాలు లేవు. దీంతో వారికి అనుమానం కలిగి.. చివరకు తమకు ఫోన్ చేసిన ప్రతాప్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.
Crime: మూడో అంతస్థులో బంగారం షాపు.. అడుగడుగునా 16 సీసీ కెమెరాలు.. అయినా ఎలా చోరీ చేయగలిగారంటే..!
సదరు యువకుడు ఆర్టిఫిషియల్ ఇంజెలిజెన్స్ (Artificial Intelligence) సాయంతో సింహం ఉన్నట్లు వీడియో క్రియేట్ చేసినట్లు తెలుసుకుని స్థానికులతో పాటూ పోలీసులూ షాక్ అయ్యారు. ఫేక్ వీడియో క్రియేట్ చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా.. పోలీసులను కూడా తప్పుదారి పట్టించినందుకు గాను అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఇకపై ఎవరైనా ఇలాంటి పనులకు పూనుకొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నిజంగా సింహం వచ్చుంటే.. వాడికి అర్థమయ్యేది’’.. అని కొందరు, ‘‘ఇలాంటి కోతి చేష్టల వల్ల జనం ఇబ్బంది పడుతున్నారు’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-10-06T20:55:16+05:30 IST