ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: రైల్లో ఓ యువతి సీక్రెట్‌గా తీసిన ఈ వీడియోను చూస్తే గుండె తరుక్కుపోవడం ఖాయం.. తల్లిదండ్రులు అంధులే అయినా..!

ABN, First Publish Date - 2023-11-24T20:42:17+05:30

కొందరు లేనిదానికోసం వెంపర్లాడుతూ ఉన్న సంతోషాన్ని దూరం చేసుకుంటుంటారు. మరికొందరు అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్నా ఏ పనీ చేయకుండా.. నిత్యం ఏదో కోల్పోయినట్లు బాధపడుతుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ...

కొందరు లేనిదానికోసం వెంపర్లాడుతూ ఉన్న సంతోషాన్ని దూరం చేసుకుంటుంటారు. మరికొందరు అన్ని అవయవాలూ సక్రమంగా ఉన్నా ఏ పనీ చేయకుండా.. నిత్యం ఏదో కోల్పోయినట్లు బాధపడుతుంటారు. అయితే ఇంకొందరు మాత్రం ఎన్ని కష్టాలొచ్చినా కుంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తుంటారు. ఉన్న ఒక్క జీవితాన్ని ఉన్నంతలో నిత్యం సంతోషంగా గడుపుతుంటారు. ఇలాంటి అరుదైన వ్యక్తులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రైల్లో వెళ్తున్న అంధులైన దంపతులను చూసి చలించిపోయిన యువతి.. వారిని వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన వారంతా భావోద్వేగానికి గురవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. అంధులైన ఇద్దరు దంపతులు తమ ముగ్గురు పిల్లలతో కలిసి ఢిల్లీ మెట్రో రైలు (Delhi Metro Rail) ఎక్కారు. వారిద్దరికీ కళ్లు కనబడకున్నా (Blind husband and wife) పిల్లలకు మత్రం ఎలాంటి సమస్యా లేదు. పిల్లలకు రైలు ప్రయాణ అనుభవం చూపించాలనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా వారిని తీసుకెళ్లారు. రైలు కదిలాక పిల్లలు ఆ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తుంటే.. వారికి కనపడకున్నా పిల్లల ఆనందాన్ని తమ ఆనందంగా భావిస్తూ తల్లితండ్రులు కూడా ఎంతో మురిసిపోయారు.

Wife: ఛీ..ఛీ.. వీడసలు భర్తేనా..? భార్య నోట్లో చున్నీని కుక్కి.. ఆమెపై పెట్రోల్‌ను పోసి మరీ దారుణం.. అసలేం జరిగిందంటే..!

తల్లి తన కొడుకును చేతులతో తడిమి తడిమి చూసి, బాలుడు సంతోషంగా ఉండడం చూసి తాను కూడా పట్టరాని ఆనందానికి లోనైంది. కొడుకును ఎంతో ప్రేమగా ముద్దాడుతూ మురిసిపోయింది. తమకు చూపు లేదన్న బాధ వారిలో ఏమాత్రం కనిపించలేదు. ఈ దంపతులను చూసిన వారంతా చలించిపోయారు. కళ్లు లేకున్నా ఎంతో సంతోషంగా ఉండడం అందరి హృదయాలను కట్టిపడేసింది. ఓ యువతి ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ కుటుంబం కలకాలం ఇలాగే సంతోషంగా ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘వీరిని అంతా ఆదర్శంగా తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, ‘‘తల్లి ప్రేమ అంటే ఇలాగే ఉంటుంది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Indian Railway: రైల్లో అర్ధరాత్రి ముగ్గురు కుర్రాళ్ల మందు పార్టీ.. వెనుక సీట్లోనే కూర్చున్న ఈమెకు విసుగొచ్చి..!

Updated Date - 2023-11-24T20:42:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising