Love Twist: ప్రేయసే వెతుక్కుంటూ వచ్చిందని పెళ్లి చేసుకున్నాడు.. సరిగ్గా 45వ రోజు ఆమె కోసం వచ్చిందెవరో చూసి..!
ABN, First Publish Date - 2023-07-22T20:15:25+05:30
ప్రేమ ఎప్పుడు, ఎవరిపై పుడుతుందో ఎవరూ చెప్పలేరు. దీనికి తోడు ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడెక్కడి వారో ఒక్క క్షణంలో స్నేహితులైపోతున్నారు. అయితే ఈ స్నేహం కొన్నిసార్లు ప్రేమ వరకూ దారి తీస్తుంటుంది. ఇలాంటి ప్రేమ వ్యవహారాలు అప్పుడప్పుడూ..
ప్రేమ ఎప్పుడు, ఎవరిపై పుడుతుందో ఎవరూ చెప్పలేరు. దీనికి తోడు ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎక్కడెక్కడి వారో ఒక్క క్షణంలో స్నేహితులైపోతున్నారు. అయితే ఈ స్నేహం కొన్నిసార్లు ప్రేమ వరకూ దారి తీస్తుంటుంది. ఇలాంటి ప్రేమ వ్యవహారాలు అప్పుడప్పుడూ చాలా దూరం వెళ్తుంటాయి. తాజగా, ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ప్రియుడిని వెతుక్కుంటూ ఎంతో దూరం వెళ్లింది. ప్రేయసే వెతుక్కుంటూ రావడంతో అతడు కూడా వెంటనే పెళ్లి చేసుకున్నాడు. అయితే సరిగ్గా 45వ రోజు షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
పంజాబ్ లూథియానా (Punjab Ludhiana) ప్రాంత పరిధికి చెందిన 17ఏళ్ల యువతికి కొన్ని నెలల కిందట ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) బీహార్ మధుబని జిల్లా రూపాలి గ్రామానికి చెందిన కుమార్ యాదవ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. మొదట్లో ఇద్దరూ ఇన్‌స్టాలో మెసేజ్‌లు చేసుకుంటూ ఉండేవారు. కొన్నాళ్లకు వీరి మధ్య చనువు ఏర్పడంతో మొబైల్ నంబర్ల ద్వారా మెసేజ్‌లు చేసుకునేవారు. తర్వాత ఏకంగా ఫోన్లు, వీడియో కాల్స్ (Phones and video calls) చేసుకునేవారు. ఇలా ఇద్దరి మధ్య ప్రేమ (love) మొదలైంది. చివరకు పెద్దలకు తెలీకుండా పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. నెలన్నర క్రితం యువతి ప్రియుడి కోసం బీహార్ వెళ్లింది.
అక్కడ ఇద్దరూ కలిసి వివాహం (love marriage) చేసుకుని, హర్లాఖి పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్హి గ్రామంలో గది అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. మరోవైపు తమ కూతురును కిడ్నాప్ చేశాడంటూ తల్లిదండ్రులు.. లూథియానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు.. 45 రోజుల తర్వాత వారిద్దరినీ గుర్తించారు. బర్హి గ్రామానికి వెళ్లి వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ‘‘నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు.. నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నా’’.. అని యువతి పోలీసులకు తెలియజేసింది. అయితే ఆమె మైనర్ (minor girl) కావడంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపున ఈ వార్త అటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది.
Updated Date - 2023-07-22T20:15:25+05:30 IST