ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: కారు ఇంజిన్‌లో ఇరుక్కుపోయిన కొండ చిలువ.. గంటన్నర పాటు కష్టపడి దాన్ని ఎలా బయటకు తీశారంటే..!

ABN, First Publish Date - 2023-10-18T21:40:35+05:30

వింత వింత ప్రదేశాల్లో విష సర్పాలు కనిపించడం తరచూ చూస్తూ ఉంటాం. విష సర్పాలు కొన్నిసార్లు షూల నుంచి బుసలుకొడుతూ బయటికి వస్తుంటే.. మరికొన్నిసార్లు మంచాల కింద నుంచి, ఇంకొన్నిసార్లు ఏకంగా ఇంటి సీలింగ్ నుంచి ఊడిపడుతుంటాయి. ఇలాంటి...

వింత వింత ప్రదేశాల్లో విష సర్పాలు కనిపించడం తరచూ చూస్తూ ఉంటాం. విష సర్పాలు కొన్నిసార్లు షూల నుంచి బుసలుకొడుతూ బయటికి వస్తుంటే.. మరికొన్నిసార్లు మంచాల కింద నుంచి, ఇంకొన్నిసార్లు ఏకంగా ఇంటి సీలింగ్ నుంచి ఊడిపడుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలను చాలా చూశాం. తాజాగా, ఓ కారు ఇంజిన్‌లో ఇరుక్కుపోయిన కొండ చిలువ వీడియో వైరల్ అవుతోంది. సుమారు 6 అడుగుల కొండ చిలువ కారు ఇంజిన్‌లోకి దూరింది. దీంతో స్నేక్ క్యాచర్లు సుమారు గంటన్నర పాటు కష్టపడి దాన్ని సురక్షితంగా బయటికి తీశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు..‘‘ఇంతకీ ఈ పాము కారు ఇంజిన్‌లోకి ఎలా దూరిందబ్బా..!’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

దక్షిణ ఢిల్లీలోని (South Delhi) చిత్తరంజన్ పార్క్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్క్ ప్రహరీకి సమీపంలో పార్క్ చేసిన కారులోకి ఓ 6అడుగుల కొండచిలువ దూరింది. చివరకు అది కారు ఇంజిన్ ముందు భాగంలో (python stuck in car) ఇరుక్కుపోయింది. దీంతో చివరకు ఎటూ కదల్లేక అలాగే ఉండిపోయింది. కారు యజమాని అక్కడికి వచ్చి స్టార్ట్ చేయాలని చూశాడు. అయితే అతడికి లోపల ఏదో ఉన్నట్లు అనుమానం కలిగింది. చివరకు ఇంజిన్‌లో ఇరుక్కున్న కొండచిలువను చూసి షాక్ అయ్యాడు. వెంటనే ఢిల్లీలోని వైల్డ్‌లైఫ్ SOS అనే స్వచ్ఛంద సంస్థ (Charity organization) సభ్యులకు సమాచారం అందించాడు.

Shocking: ఓ ఇంట్లోంచి తీవ్ర దుర్వాసన.. లోపలి నుంచి తాళం పెట్టి ఉందని గుర్తించిన స్థానికులు.. పోలీసులు తలుపులను పగలగొట్టి చూస్తే..!

సమాచారం అందుకున్న స్వచ్ఛంద సంస్థ సభ్యులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. కొండచిలువ ప్రాణాలకు హాని కలగకుండా జాగ్రత్తగా బయటికి తీసేందుకు వివిధ రకాలుగా ఆలోచించారు. చివరకు ఓ వ్యక్తి కారు కిందకు దూరి.. గంటన్నర పాటు కష్టపడి ఎట్టకేలకు ఇంజిన్‌లో ఇరుక్కున్న కొండచిలువను బయటికి తీశాడు. కొండచిలువకు ఎలాంటి గాయాలూ కాకుండా సురక్షితంగా బయటకు తీసి అటవీ శాఖ అధికారులకు (Forest Department officials) అప్పగించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. కొండచిలువను రక్షించిన స్వచ్ఛంద సంస్థ సభ్యులను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 22వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: డ్రైవర్ లేకుండానే దూసుకెళ్తున్న బస్సు.. ఇంజిన్ ముందు వైపు చూస్తే అవాక్కవడం ఖాయం..

Updated Date - 2023-10-18T21:40:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising