కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral video: ఇదెక్కడి వింత!.. ఏటీఎం గదిలో ఇలాంటి దృశ్యం చూస్తామని ఎవరైనా ఊహిస్తామా...

ABN, First Publish Date - 2023-07-09T19:34:14+05:30

కళ్లముందు ఉన్నట్టుండి చోటు చేసుకునే ఘటనలు కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురిచేస్తే.. మరికొన్నిసార్లు ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే ఇంకొన్ని దృశ్యాలు.. ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇటీవల తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా..

Viral video: ఇదెక్కడి వింత!.. ఏటీఎం గదిలో ఇలాంటి దృశ్యం చూస్తామని ఎవరైనా ఊహిస్తామా...
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళ్లముందు ఉన్నట్టుండి చోటు చేసుకునే ఘటనలు కొన్నిసార్లు ఆశ్చర్యానికి గురిచేస్తే.. మరికొన్నిసార్లు ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే ఇంకొన్ని దృశ్యాలు.. ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇటీవల తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లిన వ్యక్తి.. లోపలి దృశ్యం చూసి ఉన్నట్టుండి షాక్ అయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఏటీఎం గదిలో ఇలాంటి దృశ్యం చూస్తామని ఎవరైనా ఊహిస్తామా... అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో రెండేళ్ల కిందటి వీడియో (Viral video) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి నగదును విత్‌డ్రా చేసేందుకు ఏటీఎంకు (ATM) వెళ్లాడు. అయితే ఏటీఎం గది డోరు తీయగానే.. లోపలి దృశ్యం చూసి షాక్ అయ్యాడు. ఓ పొడవాటి పాము ఏటీఎం మిషన్ మీదకు పాకుతూ కనిపించింది. మిషన్ పైకి పాకుతూ వెళ్లిన పాము.. డిస్‌ప్లే పై అటూ ఇటూ చూసి.. చివరకు పైన ఉన్న (snake enters in ATM ) రంధ్రంలోకి వెళ్లింది. చూస్తుండగానే అంత పెద్ద పాము మిషన్ లోపలికి వెళ్లిపోతుంది.

Viral video: హంసపై దాడి చేసిన పులి.. తీరా దగ్గరికి వెళ్లాక సీన్ రివర్స్.. చివరికి ఏమైందో చూడండి..

కలలో కూడా ఊహించని ఈ సీన్ చూసి అతను ఒక్కసారిగా బిత్తరపోయాడు. విషయం తెలియడంతో చుట్టు పక్క ఉన్న వారంతా అక్కడ గుమికూడతారు. వీడియో అంతటితో ముగుస్తుంది. ఈ ఘటన మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఇదెక్కడి వింతరా బాబోయ్’’.. అని కొందరు, ‘‘ఈ పాముకు అర్జంట్‌గా డబ్బులతో పని పడ్డట్టుంది’.. అని ఇంకొందరు, ‘‘ఇతడి టైం బాగుండి సరిపోయింది’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral video: బోగీలో యువతి ప్రవర్తన చూసి బిత్తరపోయిన ప్రయాణికులు.. స్టేషన్‌లో రైలు ఆగగానే.. ఏం చేసిందో చూడండి..

Updated Date - 2023-07-09T19:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising