ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Software Engineer: ఒకే ఒక్క నిమిషంలో ఏకంగా రూ.17 లక్షలు మటాష్.. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు షాకింగ్ అనుభవం.. లక్షల్లో జీతం వస్తున్నా..!

ABN, First Publish Date - 2023-04-29T15:56:47+05:30

ఆశ మనిషితో ఎంత పనైనా చేయిస్తుంది. కొందరికి లక్షల ఆదాయం వస్తున్నా ఇంకా సంపాదించాలనే ఆశ ఉంటుంది. ఈ క్రమంలో చాలా మంది ఇతరులను మోసం చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతుంటే.. కొందరు ఇతరులు చెప్పే మాటలు నమ్మి చివరకు మోసపోతుంటారు. ఇలాంటి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆశ మనిషితో ఎంత పనైనా చేయిస్తుంది. కొందరికి లక్షల ఆదాయం వస్తున్నా ఇంకా సంపాదించాలనే ఆశ ఉంటుంది. ఈ క్రమంలో చాలా మంది ఇతరులను మోసం చేస్తూ అక్రమార్జనకు పాల్పడుతుంటే.. కొందరు ఇతరులు చెప్పే మాటలు నమ్మి చివరకు మోసపోతుంటారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న యువతికి లక్షల జీతం వస్తోంది. ఇటీవల ఆమె ఒకే ఒక్క నిమిషంలో ఏకంగా రూ.17లక్షలు పోగొట్టుకుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ (Uttar Pradesh Ghaziabad) పరిధికి కవినగర్‌కు చెందిన ఐశ్వర్యం అనే యువతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా (Software Engineer) పని చేస్తోంది. లక్షల్లో జీతం తీసుకుంటున్న ఈమెకు ఇటీవల వాట్సప్‌లో ఓ మెసేజ్ (WhatsApp message) వచ్చింది. ఇంట్లో ఉంటూనే రోజూ రూ.3వేల నుంచి రూ.4వేలు సంపాదించే అద్భుత అవకాశం అంటూ గుర్తు తెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. వారిని కాంటాక్ట్ అవగా.. ఇన్‌స్టాగ్రామ్ వీడియోలకు (Instagram videos) లైకులు కొట్టాలని చెప్పారు. ఒక్కో లైక్‌కు రూ.70లు వస్తాయని చెప్పడంతో యువతి ఆశపడింది. ఇదేదో బాగుందే అనుకుని ఓకే చెప్పింది. దీంతో ఆమెను మొదటగా టెలిగ్రామ్‌ గ్రూప్‌లో (Telegram group) యాడ్ చేశారు. తర్వాత వాటిలో ఇన్‌స్టా రీల్స్‌ను షేర్ చేస్తూ వచ్చారు.

Viral Video: బల్లి కరిస్తే ఏమవుతుంది..? ఈ కుర్రాడి చెవికి చివరకు ఏమైంది..?

వీడియోలకు లైక్‌లు కొట్టినందుకు గానూ వచ్చే మొత్తం.. ఆమెకు సంబంధించిన వాలెట్‌లో యాడ్ అవుతూ వచ్చింది. దీంతో సదరు యువతికి (young woman) ఎలాంటి అనుమానం కలగలేదు. కొన్ని రోజుల తర్వాత వాలెట్‌లోని మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలని అనుకుంది. అయితే ఇక్కడే దుండగులు తమ తెలివితేటలు ప్రదర్శించారు. వాలెట్‌లోని మొత్తం తీసుకోవాలంటే ముందుగా క్రిప్టో కరెన్సీలో (Crypto currency) కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. ఇలా విడతల వారీగా ఆమెతో రూ.17లక్షలను బదిలీ చేయించుకున్నారు. తర్వాత కూడా మళ్లీ డబ్బులు డిమాండ్ చేస్తుండడంతో ఆమెకు అనుమానం కలిగింది. చివరకు మోసపోయానని తెలుసుకుని పోలీసులు ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగులను పట్టుకునే పనిలో పడ్డారు.

Viral news: చదువుకున్న బ్యాచ్‌లర్స్ కదా అని ఇల్లు అద్దెకిస్తే.. ఎంత పని చేశారో చూడండంటూ ఫొటోలను బయటపెట్టిన యజమాని..

Updated Date - 2023-04-29T15:56:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising