ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Love couple: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ప్రేమజంట.. హోటల్ గదిలో ఉండగా కుటుంబ సభ్యుల నుంచి ఫోన్.. యువతి చెప్పింది విని.. అక్కడికి వెళ్లి చూడగా..

ABN, First Publish Date - 2023-05-07T21:06:52+05:30

ప్రేమికులకు ప్రధానంగా పెళ్లి విషయంలోనే సమస్యలు తలెత్తుతుంటాయి. కులం, మతం, ఆస్తిపాస్తులు.. ఇలా ఏవేవో కారణాల వల్ల కుటుంబ సభ్యులు అడ్డు తగులుతూ ఉంటారు. ఈ క్రమంలో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడమో, లేక..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రేమికులకు ప్రధానంగా పెళ్లి విషయంలోనే సమస్యలు తలెత్తుతుంటాయి. కులం, మతం, ఆస్తిపాస్తులు.. ఇలా ఏవేవో కారణాల వల్ల కుటుంబ సభ్యులు అడ్డు తగులుతూ ఉంటారు. ఈ క్రమంలో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడమో, లేక రాజీపడి నచ్చని వారిని పెళ్లి చేసుకోవడమో చేస్తుంటారు. కొందరు ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకోలేక.. చివరకు ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రేమ జంట విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధంగా జరిగింది. ప్రేమికులకు పెళ్లి చేయాలని ఇరువైపు కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో హోటల్‌ గదిలో ప్రియుడితో ఉన్న యువతికి ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. చివరకు ఆమె చెప్పింది విని అంతా అక్కడికి వెళ్లి చూసి షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఇండోర్‌లోని విజయ్ నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన యువకుడికి ఇదే ప్రాంతానికి చెందితో కొన్ని నెలల కిందట పరిచయం ఏర్పడింది. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. కొన్నాళ్లకే అది ప్రేమగా (love) మారింది. అప్పటినుంచి కుటుంబ సభ్యులకు తెలీకుండా కలుసుకునేవారు. అందరి ప్రేమికుల (lovers) మాదిరే వీరు కూడా.. కుటుంబ సభ్యులు ఒప్పుకొన్నా లేకపోయినా.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

Viral Video: కారుకు పెట్రోల్ పట్టేందుకు తెగ శ్రమించింది.. చివరకు యజమాని చెప్పింది విని నాలుక్కరుచుకున్న యువతి..

అయితే ఒకసారి ఇంట్లో చెప్పి చూడాలని అనుకున్నారు. అనుకున్నట్లే ఇద్దరూ వారి వారి కుటుంబ సభ్యులకు ప్రేమ విషయం తెలియజేశారు. అయితే విచిత్రంగా రెండు కుటుంబాల వారూ వీరి పెళ్లికి (marriage) అంగీకరించారు. త్వరలో ఘనంగా పెళ్లి చేయాలని కూడా అంతా మాట్లాడుకున్నారు. పెళ్లికి ఎలాంటి అడ్డకుంలూ లేకపోవడంతో ఇద్దరూ చాలా సంతోషపడ్డారు. శనివారం ఇద్దరూ సమీప పట్టణంలో ఓ హోటల్‌లో గది (Lovers in hotel room) తీసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఎంత సేపటికీ బయటకు రాలేదు. ఈ క్రమంలో యువతి తల్లిదండ్రులు వారికి ఫోన్ చేశారు.

Viral Video: మొదటిసారి ఎక్కిందో ఏమో.. విమానంలో ఉన్నట్టుండి ఈ యువతి చేసిన పనికి.. అవాక్కయిన ప్రయాణికులు..

ఫోన్ లిఫ్ట్ చేసిన యువతి.. ‘‘నాన్నా.. త్వరగా వచ్చి మమ్మల్ని కాపాడండి’’.. అని ఏడుస్తూ ఉంది. దీంతో కుటుంబ సభ్యులు కంగారుగా అక్కడికి వెళ్లారు. హోటల్ సిబ్బంది అంతా కలిసి తలుపులు తట్టినా లోపల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. చివరకు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు బద్దలుకొట్టి చూడగా లోపల ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వెంటనే వారిని చికిత్సం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మృతి చెందినటన్లు వైద్యులు తెలిపారు. విషం తాగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పెద్దలు పెళ్లికి అంగీకరించినా.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Viral Video: ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోయాడు.. ఇతన్ని ఎలా కాపాడాలో మీరైనా చెప్పగలరా..

Updated Date - 2023-05-07T21:06:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising