IT Jobs Alert: నిరుద్యోగులూ.. బీ అలెర్ట్.. భారీ రిక్రూట్‌మెంట్‌కు రెడీ అవుతున్న టీసీఎస్.. ఏకంగా 40 వేల జాబ్స్..!
ABN, First Publish Date - 2023-10-17T18:41:18+05:30
దేశంలోనే ప్రముఖ ఐటీ కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒకటనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఏడాది 35 నుంచి 40వేల మంది కొత్తవారిని నియమించుకునే ఈ కంపెనీ.. తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరలోనూ...
దేశంలోనే ప్రముఖ ఐటీ కంపెనీల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒకటనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఏడాది 35 నుంచి 40వేల మంది కొత్తవారిని నియమించుకునే ఈ కంపెనీ.. తాజాగా నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ ఆర్థిక సంవత్సరలోనూ 40వేల మంది ఫ్రెషర్లను నియమించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఫ్రెషర్స్‌కు రిక్రూట్‌మెంట్స్ లేవని ఇన్ఫోసిస్ ప్రకటించిన నేపథ్యంలో నిరుద్యోగులకు టీసీఎస్.. ఊహించని ఆఫర్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఈ మేరకు టీసీఎస్ సంస్థ Chief Operating Officer సుబ్రమణ్యం ప్రకటన విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే..
ఐటీ రంగంలోని ఇతర ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్ (Campus placement) విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం ప్రముఖ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌తో (Infosys) పాటూ పలు ఐటీ కంపెనీలు నియామకాలను నిలిపివేశాయి. గత ఏడాది 50వేల మంది ఫ్రెషర్లను నియమించుకున్నట్లు ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో నిలంజన్ రాయ్ (infosys cfo nilanjan roy) తెలిపారు. దీంతో డిమాండ్ పెరిగే వరకూ కొత్త నియామకాలు చేపట్టబోమని స్పష్టం చేశఆరు. ఈ తరుణంలో టీసీఎస్ కంపెనీ ప్రకటన (TCS Company Announcement) నిరుద్యోగుల ఆశలపై నీల్లు చల్లినట్లయింది.
ఇదిలావుండాగా, టీసీఎస్ కంపెనీ ఇటీవల రిక్రూట్‍మెంట్ స్కామ్‌లో చిక్కుకున్న విషయం తెలిసిందే. లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇస్తున్నారన్న విషయం బయటికి తెలియడంతో కంపెనీ యాజమాన్యం.. ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించింది. విచారణ అనంతరం సంబంధిత విభాగానికి సంబంధించి మొత్తం 16 మంది ఉద్యోగులను తొలగించినట్లు ఆదివారం ప్రకటించింది. అలాగే టీసీఎస్ కంపెనీ వర్క్‌ఫ్రం హోమ్ సంస్కృతికి స్వస్తి పలికింది. ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగులందరినీ కార్యాలయాలకు రావాలని కోరింది. ఇప్పటివరకూ సుమారు 70శాతం మంది ఉద్యోగులు కార్యాలకు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ప్రస్తుతం పని చేస్తున్న వారిని తొలగించే ఆలో్చన లేదని కూడా కంపెనీ స్పష్టం చేసింది. ప్రస్తుతం తాము కొత్త నియామకాలతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొంది.
Updated Date - 2023-10-17T18:41:18+05:30 IST