Snake in AC: బాబోయ్.. ఏసీలోంచి సడన్‌గా బయటికొచ్చి.. ఎలుకను పట్టేసుకున్న పాము.. ఎలా లోపలికి తీసుకెళ్తోందో చూస్తే..!
ABN , First Publish Date - 2023-08-28T15:45:06+05:30 IST
విషపూరిత సర్పాలకు ఎలుకలు, కప్పలు ఆహారం అనే సంగతి తెలిసిందే. వాటిని పట్టుకోవడంలో పాములు అద్భుతమైన నేర్పును ప్రదర్శిస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఎలుకను పాము పట్టుకున్న విధానం చూస్తే షాక్ అవక తప్పదు. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
విషపూరిత సర్పాలకు (Snakes) ఎలుకలు, కప్పలు ఆహారం అనే సంగతి తెలిసిందే. వాటిని పట్టుకోవడంలో పాములు అద్భుతమైన నేర్పును ప్రదర్శిస్తాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Snake Viral Video)లో ఎలుకను పాము పట్టుకున్న విధానం చూస్తే షాక్ అవక తప్పదు. ఆ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. theanimal.empire అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది (Snake in AC).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఏసీ నుంచి పాము బయటకు వచ్చింది. ఓ ఇంట్లో అమర్చిన ఏసీలో పాము ఉండడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ ఏసీ కింద ఉంచిన టేబుల్‌పై ఉన్న ఎలుకను చూసిన పాము బయటకు వచ్చింది. వేగంగా కిందకు పాకి ఆ ఎలుకను తన నోటితో పట్టుకుంది (Snake licked the rat). ఆ ఎలుకను తన నోటితో పట్టుకుని తిరిగి ఏసీ లోపలికి వెళ్లిపోయింది. ఆ ఘటనను అక్కడ ఉన్న వారు వీడియో తీశారు. చాలా రోజులుగా పని చేయని ఏసీలో పాము నివాసం ఉన్నట్టు తెలుస్తోంది.
Miracle: అద్భుతం అంటే ఇదేనేమో.. పెళ్లయి నాలుగేళ్లయినా అస్సలు పిల్లలే పుట్టలేదు.. ఇప్పుడు ఒకే కాన్పులో ఏకంగా..!
ఈ వీడియో సోషల్ మీడియా జనాలను నివ్వెరపరుస్తోంది. ఒకరోజు క్రితం షేర్ అయిన ఈ వీడియో వేలల్లో వ్యూస్ దక్కించుకుంది. రెండు వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ``ఎవరూ ఎక్కడా సురక్షితంగా లేరు``, ``ఎవరో ఎలుకల బాధ తట్టుకోలేక పామును పెంచుకుంటున్నట్టు ఉన్నారు``,``ఇంటి ఏసీలో పాము ఏం చేస్తోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.