Pregnant: అచ్చం ఆ సినిమాలానే 47 సంవత్సరాల వయస్సులో తన గర్భం గురించి, 23 ఏళ్ళ కూతురితో ఎలా చెప్పిందంటే..! సోషల్ మీడియాను ఊపేస్తున్న ఈ వార్త ఏంటంటే..!

ABN , First Publish Date - 2023-03-16T13:57:44+05:30 IST

మీ అమ్మ కడుపుతో ఉందమ్మా.. నీకు ఎప్పుడో చెబుదాం అనుకున్నాం కానీ ...

Pregnant: అచ్చం ఆ సినిమాలానే 47 సంవత్సరాల వయస్సులో తన గర్భం గురించి, 23 ఏళ్ళ కూతురితో ఎలా చెప్పిందంటే..! సోషల్ మీడియాను ఊపేస్తున్న ఈ వార్త ఏంటంటే..!
miraculous pregnancy

మొదటి బిడ్డ పుట్టిన ఒకటో, రెండో ఏడాదికి మరో బిడ్డ కోసం ఫ్లాన్ చేసుకుంటూ ఉంటారు ప్రతి దంపతులు, కానీ దీనికి పూర్తి భిన్నంగా కూతురికి పెళ్ళి చేసి అత్తవారింటికి పంపాల్సిన ఓ తల్లి తను గర్భం దాల్చానని అదీ తన 47 ఏళ్ళు.. ఈ సంగతి విన్న కూతురి సంగతి ఏమై ఉంటుందా అనేదే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ ఛల్ చేస్తుంది. అసలు విషయానికి వస్తే..

23 ఏళ్ళ ఆర్యా పార్వతి చదువుకుంటూ ఇంటికి దూరంగా ఉంటుంది. తండ్రి నుంచి ఓ రోజు ఫోన్ రావడంతో మామూలుగానే ఆన్సర్ చేసింది. తండ్రి గొంతు కాస్త చిరాగ్గా, విసుగు నిండినట్టుగా ఉంది. సరే ఏదో పనిలో ఉండి మాట్లాడుతున్నారులే అనుకుంది. ఈలోపు తండ్రి "మీ అమ్మ కడుపుతో ఉందమ్మా.. నీకు ఎప్పుడో చెబుదాం అనుకున్నాం కానీ నువ్వు ఎలా తీసుకుంటావోననే విషయంగా చెప్పలేకపోయాం. ఇప్పుడు అమ్మకు ఎనిమిదో నెల".. అని చెప్పేసరికి నోట మాటరాలేదు. పార్వతికి..చాలా షాక్ కి గురైంది. ఎంటి వీళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనుకుంది కానీ.. కాస్త నిమ్మళంగా ఆలోచించాకా తనలానే ఇంకో బిడ్డ వాళ్ళకి ఉండటం సరైనదే ననే అభిప్రాయానికి వచ్చింది. తల్లి దగ్గరకు వచ్చేసి ఆమెను ఆనందంగా కౌగిలించుకుంది. తన సంతోషాన్ని తెలియజేసింది.

అచ్చం ఆ సినిమాలానే..

ఆయుష్మాన్ ఖురానా పోషించిన 25 ఏళ్ల నకుల్, తన తల్లి గర్భం గురించి తెలుసుకుని షాక్ అయిన బదాయి హో సినిమా గురించి ఇది మనకు గుర్తు వస్తుంది. ఈ చిత్రం గర్భం వల్ల కుటుంబంలో కలిగే మానసిక సంఘర్షణల ప్రయాణాన్ని చిత్రీకరించింది. ఈ సినిమాలో నీనా గుప్తా తల్లి పాత్రలో నటించింది.

ఇది కూడా చదవండి: పిల్లలు చదివేలా ఏ పుస్తకాలు ఎంచుకోవాలి.. మీకు క్లారిటీ ఉందా..?

మామూలుగా 40 ఏళ్లలో గర్భం దాల్చే అవకాశాలు తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇప్పటికీ అవకాశం ఉంది. నివేదికల ప్రకారం, ఇటీవలి సంవత్సరాలలో 40 ఏళ్లు పైబడిన వారిలో జననాల రేటు పెరిగింది. అప్పటి వరకు ఒంటరి బిడ్డగా ఉన్న ఆ అమ్మాయి తనకు ఎప్పుడూ తోబుట్టువు కావాలని అడిగినా తల్లి తనకు మరో గర్భం దాల్చే వీలు లేదని చెప్పేది.

𝗪𝗵𝘆 𝘄𝗼𝘂𝗹𝗱 𝗜 𝗯𝗲 𝗮𝘀𝗵𝗮𝗺𝗲𝗱?

నిజానికి చెల్లో తమ్ముడో కావాలని పార్వతి తల్లిని చాలాసార్లు అడిగేది. దానికి తల్లి తనకు మరో గర్భం రాదని చెబుతూ ఉండేది. అయితే ఈ హఠాత్తుగా ఇలా జరగడం పాపం ఆమెకు కూడా తెలియని విషయం. పిరియడ్స్ ఆగిపోయాని మొదట అనుకుంది. కానీ భర్తతో గుడికి వెళ్ళినపుడు కళ్లు తిరిగి పడిపోయిన సందర్భంలో తను మళ్ళీ కడుపుతో ఉన్న సంగతి తెలిసింది. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. అప్పడు తనకి ఏడో నెల. ఆ వయసులో గర్భం తీయించుకోవడం కూడా కష్టమే. అందుకే ధైర్యం చేసి కుతురికి ఈ సంగతి చెప్పారు. పార్వతి కూడా సంఘం ఏం అనుకుంటుందోనని మొదట భయపడినా ఇప్పుడు తల్లికి సపోర్ట్ గా నిలిచింది. ఆమెతో సమయాన్ని గడిపింది. సంతోషాన్ని, ఆనందాన్ని పంచుకుంది.

బుజ్జాయి ఇంటికొచ్చిన వేళ..

గత వారంలోనే పార్వతి తల్లి ఆడపిల్లకు జన్మనిచ్చింది. జీవితం మరింత అర్ధవంతం కాలేదుకానీ. ఈ చిన్నారి తనను అక్కా అని ఎప్పుడు పిలుస్తుందాని మాత్రం పార్వతి ఎదురుచూస్తుంది. అనుకోకుండా వచ్చిన ఈ చిన్నారి అతిథి తనకు అంత ప్రీతికరంగా మారిపోతుందని ఎప్పుడూ అనుకోలేదు. ఇక కొందరు బంధువులు ఈ తీపి కబురు విని ఆనందించారు. కొందరు మూతి తిప్పుకున్నారు. అయినా పార్వతి తల్లిదండ్రులకు పెద్దకూతురు అర్థం చేసుకుందిలే అదే చాలనే భరోసా ఉంది.

Updated Date - 2023-03-16T13:57:44+05:30 IST