Viral Video: ఎంత దారుణం! దోపిడీ దొంగలను అడ్డుకున్న పాపానికి ఈ క్యాబ్ డ్రైవర్ పరిస్థితి.. చివరకు..
ABN, First Publish Date - 2023-10-11T17:03:52+05:30
మనుషుల్లో మానవత్వం రోజురోజుకూ నశించిపోతోంది. ఇక నేరస్థుల విషయంలో ఇది మచ్చుకైనా కనిపించడం లేదు. సులభంగా డబ్బులు సంపాదించాలనే క్రమంలో కొందరు చివరకు దారుణాలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన వారిని చంపడానికి కూడా వెనుకాడడం లేదు. తాజాగా...
మనుషుల్లో మానవత్వం రోజురోజుకూ నశించిపోతోంది. ఇక నేరస్థుల విషయంలో ఇది మచ్చుకైనా కనిపించడం లేదు. సులభంగా డబ్బులు సంపాదించాలనే క్రమంలో కొందరు చివరకు దారుణాలకు పాల్పడుతుంటారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన వారిని చంపడానికి కూడా వెనుకాడడం లేదు. తాజాగా, దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. దోపిడీ దొంగలను అడ్డుకున్న క్యాబ్ డ్రైవర్ చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఢిల్లీలో (Delhi) చోటు చేసుకున్న హృదయవిదారక ఘటనకు సంబంధించిన వీడియో (Viral video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిజేంద్ర (43) అనే వ్యక్తి కారు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరే బుధవారం రాత్రి కూడా అతను కారు నడుపుతూ ఉన్నాడు. నగరం వెలుపల కారు ఆపుకొని ఉండగా.. కొందరు దుండగులు అక్కడికి వచ్చి అతడిపై దాడికి దిగారు. చివరకు కారు తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో బిజేంద్ర.. వారిని అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. అయినా దొంగలు బిజేంద్రను పక్కకు తోసేసి కారును తీసుకుని వేగంగా వెళ్లారు. ఈ క్రమంలో బిజేంద్ర ప్రమాదవశాత్తు కారు కింద పడ్డాడు. అయినా దొంగలు వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోయారు. దీంతో సుమారు 200మీటర్ల వరకూ (cab driver dragged by car) కారు అతన్ని లాక్కుంటూ వెళ్లింది.
తర్వాత రోడ్డుపైనే పడిపోయాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనను చూసి వాహనదారులంతా షాక్ అయ్యారు. వెనుక మరో వాహనంలో వస్తున్న ఓ వ్యక్తి.. ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ ఏడాది జనవరిలో కూడా ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కంజావాలా ప్రాంతంలో స్కూటీపై వెళ్తున్న ఓ యువతిని కారు ఢీకొట్టి.. సుమారు 12కిలోమీటర్ల పాటు లాక్కెళ్లింది. ఈ ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో పోలీసులు మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2023-10-11T17:03:52+05:30 IST