ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: హైదరాబాద్‌లో నిరుద్యోగుల పరిస్థితి మరీ ఇంత దారుణంగానా..? ఒక్క ఇంటర్వ్యూకు ఎన్ని వేల మంది వచ్చారో చూస్తే..!

ABN, First Publish Date - 2023-11-01T15:00:48+05:30

దేశంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పదుల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే.. వేల సంఖ్యలో నిరుద్యోగులు క్యూడుతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమస్యకు అద్దం పట్టేలా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా...

దేశంలో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పదుల సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే.. వేల సంఖ్యలో నిరుద్యోగులు క్యూడుతున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమస్యకు అద్దం పట్టేలా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా హైదారాబాద్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. ఒకే ఒక్క ఇంటర్వ్యూకు వేల సంఖ్యలో నిరుద్యోగులు పొటెత్తారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘హైదరాబాద్‌లో నిరుద్యోగుల పరిస్థితి మరీ ఇంత దారుణంగా ఉందా..’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో హైదరాబాద్‌లో (Hyderabad) చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఓ ఉద్యోగానికి సంబంధించిన వాక్ ఇన్ ఇంటర్వ్యూకి (Walk in interview) నిరుద్యోగులు పోటెత్తారు. ఇంటర్వ్యూ జరిగే కార్యాలయం వద్ద ఆవరణ మొత్తం నిండిపోయారు. అంతేకాకుండా గేటు బయట కూడా పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతీయువకులు (Unemployed youth) బారులుతీరారు. జనం ఎక్కవ రావడంతో సదరు కార్యాలయ సిబ్బంది గేట్లు వేశారు. దీంతో నిరుద్యోగులంతా గంటల తరబడి గేటు బయట వేచి చూస్తూ ఉన్నారు. మధ్యలో గేటు తెరవగానే అంతా ఒక్కసారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా గందరగోళ వాతావరణరం నెలకొంది.

Viral Video: మెట్రో రైల్లో హద్దులు దాటిన ప్రేమ జంట... అంతా చూస్తున్నారనే కనీస జ్ఞానం కూడా లేకుండా..

గుంపులో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకోవడంతో చాలా మంది యువతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘జాతరలో కూడా ఇంత జనాన్ని చూడలేదు’’.. అని కొందరు, ‘‘ఇంతమంది నిరుద్యోగులు వచ్చారు.. ఇంతకీ ఏంటా జాబ్’’.. అని మరికొందరు, ‘‘మన దేశంలో నిరుద్యోగ సమస్యకు ఇది నిలువెత్తు నిదర్శనం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌‌ను సొంతం చేసుకుంది.

Viral Video: లిఫ్ట్‌లో ఇద్దరు మహిళల నిర్వాకాన్ని వీడియో తీయబోయిన వ్యక్తి.. కాసేపటికి ఆమె భర్త అక్కడికి రావడంతో.. చివరకు..

Updated Date - 2023-11-01T15:00:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising