ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Train Accident: ప్లాట్‌ఫామ్ మీదకే దూసుకొచ్చిన రైలు.. ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రయాణీకులు..

ABN, First Publish Date - 2023-09-27T15:04:58+05:30

రైలు పట్టాలు దాటుతూ కొందరు, ప్లాట్ ఫామ్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరికొందరు, కదులుతున్న రైలును ఎక్కడం, దిగడం చేసే క్రమంలో ఇంకొందరు ప్రమాదానికి గురైన ఘటనలు చాలా చూశాం. కానీ ఏకంగా రైలే ప్లాట్‌ఫామ్ మీదకు దూసుకొచ్చిన ఘటనలు..

రైలు పట్టాలు దాటుతూ కొందరు, ప్లాట్ ఫామ్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మరికొందరు, కదులుతున్న రైలును ఎక్కడం, దిగడం చేసే క్రమంలో ఇంకొందరు ప్రమాదానికి గురైన ఘటనలు చాలా చూశాం. కానీ ఏకంగా రైలే ప్లాట్‌ఫామ్ మీదకు దూసుకొచ్చిన ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇలాంటి అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్ మధుర జంక్షన్‌లో చోటు చేసుకుంది. రైలు ప్లాట్‪‌ఫామ్ పైకి దూసుకురావడంతో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ఉత్తరప్రదేశ్ మధుర జంక్షన్‌లో (Uttar Pradesh Mathura Junction) మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. షకూర్‌బస్తీ-మథుర ఈఎంయూ రైలు షకూర్‌బస్తీ స్టేషన్ నుంచి బయలుదేరి రాత్రి రాత్రి 10గంటలకు మథుర జంక్షన్ రెండో నంబర్ ప్లాట్‌ఫారమ్ పైకి చేరుకుంది. దీంతో ఆ రైలుకు వెళ్లాల్సిన వారంతా ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. రైలు ఆగగానే అందులో ఉన్న వారంతా కిందకు దిగిపోయారు. అయితే ఆగిన రైలు కాస్త నిముషాల వ్యవధిలో మళ్లీ ముందుకు కదిలింది. వేగంగా ముందుకు వెళ్లిన రైలు పట్టాల మీద కాకుండా.. అదుపు తప్పి ప్లాట్‌ఫామ్ పైకి దూసుకెళ్లింది. అదే సమయంలో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న వారు రైలు రావడం చూసి భయంతో పరుగులు తీశారు.

7 Big Changes: అక్టోబర్ ఒకటో తారీఖు నుంచే కొత్త రూల్స్.. ఏకంగా 7 కీలక మార్పులు.. ఏఏ ధరలు పెరగబోతున్నాయంటే..!

రైలు లోపల ప్రయాణికులు మొత్తం దిగిపోవడం, ప్లాట్‌ఫామ్‌పై కూడా ఎవరూ లేకపోవడంతో (train accident) పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో ఓ ప్రయాణికుడికి మాత్ర స్వల్ప గాయాలైనట్లు అధికారులు తెలిపారు. రైలు ప్రమాద ఘటనతో మిగతా రైళ్ల రాకపోకల్లో జాప్యం జరిగింది. అధికారులు వెంటనే రంగంలోకి దిగి, రైలును తొలగించే పనులు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఇదేంటీ మరీ విచిత్రగా ఉందే’’.. అని కొందరు, ‘‘వేగంగా వెళ్లే సమయంలో ఇలా జరిగితే పరిస్థితి ఏంటి’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 87వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో! కిటికీలో ఇరుక్కుపోయిన భారీ కొండచిలువ.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

Updated Date - 2023-09-27T15:04:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising