ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Wife Twist: అత్తారింట్లో ముభావంగా ఉంటోంటే కొత్త కదా అని అంతా అనుకున్నారు.. కానీ సరిగ్గా నెల తర్వాత ఆ కోడలు చేసిన పనికి..

ABN, First Publish Date - 2023-03-11T15:51:18+05:30

అమ్మాయికు మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. మంచిగా కాపురం చేసుకోవాలని పెద్దలు దీవించి భర్తతో సాగనంపారు. అత్తారింట్లోకి అడుగుపెట్టింది. కానీ పెళ్లైన

ఆ కోడలు చేసిన పనికి..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమ్మాయికు మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. మంచిగా కాపురం చేసుకోవాలని పెద్దలు దీవించి భర్తతో సాగనంపారు. అత్తారింట్లోకి అడుగుపెట్టింది. కానీ పెళ్లైన సంతోషం ఆమెలో కనిపించలేదు. కొత్త కదా? అని భర్త కూడా సర్దుకుపోయాడు. అయినా కూడా ముభావంగానే ఉంటుంది. అలా నెల రోజులు గడిచింది. అంతే ఉన్నట్టుండి ఒక్కసారిగా మాయమైపోయింది. ఎక్కడకెళ్లిందో ఏంటో అని అందరూ కంగారు పడ్డారు. తీరా ఆమె ఎవరితో వెళ్లిపోయిందో తెలుసుకున్న భర్త (husband).. కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. అసలు ఇంతకీ ఆమె ఏమైంది? ఎక్కడకెళ్లిందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

మనుషుల మధ్య ప్రేమానురాగాలు ఉండడం మంచిదే. అది ఆడైనా? మగైనా? కానీ దానికి భిన్నంగా ప్రవర్తిస్తే మాత్రం జీవితానికి అర్థం ఉండదు. ఈ మధ్య సృష్టి ధర్మానికి విరుద్ధంగా భాగస్వాములను ఎంచుకోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇలాంటి సంఘటనే పశ్చిమబెంగాల్‌ (West Bengal)లో చోటుచేసుకుంది.

ప్రేమ (love)ను అర్థం చేసుకునే మనసుంటే చాలు లింగభేదంతో పనేంటి? అన్నట్టుగా యువత పెడ దారి పడుతోంది. ఇదే ఆలోచనతో ఇద్దరమ్మాయిలు ఇళ్ల నుంచి పారిపోయారు. వీరిద్దరిలో ఒక అమ్మాయికి నెల రోజుల క్రితమే పెళ్లైంది. అయినా కూడా ప్రేయసి కోసం.. ఏకంగా భర్తనే వదిలేసి ఆమెతో వెళ్లిపోయింది. ఓ కాలేజీలో ఏర్పడిన స్నేహం లవ్‌స్టోరీ (love story)గా మారింది. ఒకరిది ఆలిపుర్‌ద్వార్‌ జిల్లాలోని ఫలకాటా ప్రాంతం కాగా.. మరొకరిది కూచ్‌బీహార్ జిల్లాలోని తుఫాన్‌గంజ్. ఇద్దరూ ఒకే కళాశాలలో విద్యను అభ్యసించారు. అయితే రెండేళ్ల క్రితం ఫుట్‌బాల్ (Football) ఆడుతుండగా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా మారి ఒకర్నొకరు విడిచి ఉండలేని పరిస్థితికి వచ్చారు. ఈ విషయం ఇంట్లో పెద్దలకు తెలియడంతో తుఫాన్‌గంజ్‌కు చెందిన అమ్మాయికి తల్లిదండ్రులు హడావుడిగా సంబంధం చూసి ఓ యువకుడితో వివాహం జరిపించారు. పరిస్థితులు సర్దుకుంటాయని అనుకుంటున్న తరుణంలో సడన్‌గా షాకిచ్చింది. పెళ్లైతే చేయగలిగారు గానీ.. ఆమె మనసులోంచి ప్రేయసిని తొలగించలేకపోయారు. దీంతో పెళ్లైన నెల రోజులకే భర్తను వదిలి.. ప్రేమించిన చెలికత్తె దగ్గరకు వెళ్లిపోయింది. ఇద్దరు కలిసి మాల్దా ప్రాంతంలోని ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకుని కలిసి జీవిస్తున్నారు. అయితే హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ యవ్వారం గుట్టురట్టైంది. తాము మేజర్లమని.. తమ సంబంధాన్ని తల్లిదండ్రులు అంగీకరిస్తే తిరిగి ఇంటికి వెళ్తామని చెప్పుకొచ్చారు. లేకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పోలీసులకు తెగేసి చెప్పారు. దీంతో చేసేదేమీలేక ఇద్దర్నీ స్టేషన్‌లో ఉంచి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారి రాక కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఓటమి భారం.. దానికి తోడు పక్కనున్నవాళ్లు నవ్వారని అవమాన భారం.. భరించలేక అతడు ఎంతకు తెగించాడంటే..

Updated Date - 2023-03-11T15:51:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising