ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: ఎవరీ కుర్రాడు.. వెంటనే కాంటాక్ట్ నెంబర్ పంపండంటూ సెలబ్రెటీల ట్వీట్లు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..!

ABN, First Publish Date - 2023-02-22T19:49:58+05:30

‘‘ఒక్క అవకాశం.. ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి.. నేనేంటో ప్రూవ్ చేసుకుంటా’’.. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే చాలా మంది నోట పలికే మాట ఇది. ఫొటో ఆల్బమ్స్ పట్టుకుని కనిపించిన ప్రతి సినిమా ఆఫీసు చుట్టూ.. చెప్పులు అరిగేలా తిరుగుతుంటారు. అయినా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘ఒక్క అవకాశం.. ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి.. నేనేంటో ప్రూవ్ చేసుకుంటా’’.. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే చాలా మంది నోట పలికే మాట ఇది. ఫొటో ఆల్బమ్స్ పట్టుకుని కనిపించిన ప్రతి సినిమా ఆఫీసు చుట్టూ.. చెప్పులు అరిగేలా తిరుగుతుంటారు. అయినా చాలా మందికి నిరాశే ఎదురవుతుంటుంది. అయితే కొందరు మాత్రం.. ఎవరి మీదా ఆధారపడకుండా ప్రతిభకు పదును పెట్టి, సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్‌ని చూపిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది అంతులేని పేరుప్రఖ్యాతలు కూడా సొంతం చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఓ కుర్రాడు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాడు. దీంతో వెంటనే అతడి కాంటాక్ట్ నెంబర్ పంపండంటూ సెలబ్రెటీలు ట్వీట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం చాలా మంది యువత.. య్యూటూబ్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్ (YouTube Instagram, Facebook, Twitter) తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది యువకులు సెలబ్రిటీలుగా మారడం కూడా చూస్తున్నాం. కొందరైతే ఒకే ఒక్క వీడియోతో వైరల్ అవుతుంటారు. ఇలాంటి వారి లిస్ట్‌లోకి.. ప్రస్తుతం బీహార్‌కు (Bihar) చెందిన అమర్జీత్ జయకర్ అనే యువకుడు కూడా చేరాడు. సింగింగ్ అంటే ఇష్టపడే ఈ యువకుడు ఇటీవల.. 2004లో సూపర్ హిట్ అయిన మస్తీ అనే చిత్రంలోని (Masti movie) ‘దిల్ దే దియా హై’ అనే పాటను పాడాడు. పాడడం అంటే ఏదో పాడాం.. అన్నట్లు కాకుండా మనసు పెట్టి ఆలపించడం అందరినీ ఆకట్టుకుంటోంది.

Viral Video: వావ్.. ఏం వీడియో గురూ.. చూసిన వాళ్లంతా ఫిదా అయిపోతున్నారుగా..!

పల్లెటూరికి చెందిన ఇతను ఉదయాన్నే ఓ చేత్తో బ్రష్ పట్టుకుని, మరో చేత్తో ఫోన్ పట్టుకుని.. సింపుల్‌గా పాటను ఆలపించేశాడు. వీడియోలో చూస్తే అతను సింపుల్‌గా ఉన్నా.. అతడి గొంతు మాత్రం అద్భుతంగా ఉందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. వీడియో తెగ వైరల్ అవడంతో (Viral videos) ఈ యువకుడు ప్రస్తుతం సెలబ్రిటీల దృష్టిలో కూడా పడ్డాడు. నటి నీతూ చంద్ర శ్రీవాస్తవ (Actress Neetu Chandra Srivastava).. ఫిబ్రవరి 21 ఈ వీడియోలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. ‘‘ఎంత అద్భుతంగా పాడాడు.. ఎవరీ అబ్బాయి.. నాకు ఫోన్ నంబర్ కావాలి’’ అని పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు ప్రస్తుతం ఈ యువకుడి గురించి ఆరాతీసే పనిలో పడ్డారు.

వాష్ రూంకి వెళ్లాలని చెప్పి భర్తతో రూ.10లు తీసుకున్న నవ వధువు.. చివరకు సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఆమె చేసిన నిర్వాకం..

Updated Date - 2023-02-22T19:51:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising