Viral Video: వారెవ్వా.. ఏం తెలివయ్యా సామీ.. మ్యాన్‌హోల్స్‌లో పడిపోయి ప్రాణాలు పోకుండా ఉండేందుకు..!
ABN, First Publish Date - 2023-07-11T15:15:38+05:30
వర్షాకాల ప్రారంభంలో ఎంతో సరదాగా అనిపించినా.. అధిక వర్షాలు కురిసే సమయంలో చివరకు చిరాకు పుడుతుంది. మరోవైపు పొలాలు, రోడ్లపై నిలిచే వర్షపు నీరు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇక పట్టణాలు, నగరాల్లో అయితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. రోడ్లపై..
వర్షాకాల ప్రారంభంలో ఎంతో సరదాగా అనిపించినా.. అధిక వర్షాలు కురిసే సమయంలో చివరకు చిరాకు పుడుతుంది. మరోవైపు పొలాలు, రోడ్లపై నిలిచే వర్షపు నీరు కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఇక పట్టణాలు, నగరాల్లో అయితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. రోడ్లపై వర్షపు నీటి మాటున ఎక్కడ మ్కాన్ హోల్స్ ఉంటాయో తెలీని పరిస్థితి. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రోడ్లపై వర్షపు నీటిలో కాళ్లు తడవకుండా వెళ్లిన ఓ వ్యక్తిని చూసి.. ‘‘వారెవ్వా.. ఏం తెలివయ్యా సామీ.. మ్యాన్‌హోల్స్‌లో పడిపోయి ప్రాణాలు పోకుండా ఉండేందుకు బాగా హెల్ప్ అవుతుంది’’.. అని కామెంట్లు చేస్తున్నారు.
ఢిల్లీలో (Delhi) చోటు చేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో (Viral video) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. భారీ వర్షం (heavy rain) కారణంగా రోడ్లపై వరద నీరు నిలిచి ఉంటుంది. ఈ సమయంలో ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్లే క్రమంలో కాళ్లు తడవకుండా వెళ్లాలని ప్రయత్నిస్తాడు. ఇందుకోసం వినూత్నంగా ఆలోచించి, చివరకు వాక్యూమ్ క్లీనర్ (Vacuum cleaner) తీసుకుని రోడ్డు పైకి వస్తాడు. మిషన్ ఆన్ చేయగానే గాలి వేగంగా బయటికి వస్తుంది. దీంతో రోడ్డుపై ఉన్న వర్షపు నీరు (rain water) చెల్లాచెదురుగా పోయి నడిచేందుకు వీలుగా ఉంటుంది.
Crime News: వివాహమైన ఏడాదికే కోడలికి షాకింగ్ అనుభవం.. ఎవరూ లేనప్పుడు మద్యం తాగమంటూ మామ చెప్పడంతో..
ఈ విధంగా అతను వర్షపు నీటిలో బూట్లు తడవకుండా రోడ్డు దాటేస్తాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న మరో వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి తెలివితేటలు.. భారతీయులకు మాత్రమే సాధ్యం’’.. అని కొందరు, ‘‘మ్యాన్‌హోల్స్ ప్రమాదం నుంచి బయటపడేందుకు ఈ ఐడియా బాగా పనికొస్తుంది’’.. అని మరికొందరు, ‘‘వారెవ్వా.. ఏం తెలివయ్యా సామీ’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో లైకులను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-07-11T15:15:38+05:30 IST