Viral Video: ఈ వీడియో చూస్తే.. షర్ట్‌ను క్షణాల్లో మడత పెట్టొచ్చు.. ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న మహిళ టాలెంట్..
ABN, First Publish Date - 2023-04-09T17:00:53+05:30
ఎలాంటి మ్యాజిక్, జిమ్మిక్కు చేయకుండానే కొందరు అద్భుతాలు చేసి చూపిస్తుంటారు. కనికట్టు లేకుండా కళ్ల ముందున్న వస్తువులతో చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటివి చూసినప్పుడు అరె! ఇంత ఈజీనా.. ఈ ఐడియా మనకెందుకు రాలేదబ్బా!.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి..
ఎలాంటి మ్యాజిక్, జిమ్మిక్కు చేయకుండానే కొందరు అద్భుతాలు చేసి చూపిస్తుంటారు. కనికట్టు లేకుండా కళ్ల ముందున్న వస్తువులతో చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటివి చూసినప్పుడు అరె! ఇంత ఈజీనా.. ఈ ఐడియా మనకెందుకు రాలేదబ్బా!.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి వినూత్నమైన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ మహిళ చేసి చూపించిన ట్రిక్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. క్షణాల్లో షర్ట్‌ను మడత పెట్టిన ఆమె టాలెంట్‌కి.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయ్యారు. సదరు వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. ప్రసంశలు కురిపించారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది.
సోషల్ మీడియాలో ఆనంద్ మహీంద్రా (Businessman Anand Mahindra) షేర్ చేసిన వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. చాలా మంది బట్టలు ఇస్త్రీ చేయడానికి, కనీసం మడతపెట్టేందుకూ బద్ధకిస్తుంటారు. ఇలాంటి వారు ఈ ట్రిక్ పాటిస్తే ఎంతో సులభంగా దుస్తులను మడత పెట్టొచ్చు. అదెలాగో ఓ మహిళ చేసి చూపించింది. ముందుగా ఆమె ఓ టీషర్ట్‌ను (T-shirt video) తీసుకుని టేబుల్‌పై పరుస్తుంది. తర్వాత దానిపై 1, 2, 3.. ఇలా మూడు నంబర్లు ఉన్న స్టిక్కర్లను వరుసగా పేరుస్తుంది. ఆ నంబర్లు ఉన్న ప్రాంతాల్లో షర్ట్‌ని పట్టుకుని మడత పెడుతుంది.
షర్ట్‌ని జస్ట్ అలా పైకి లేపి, ఇలా మడత పెట్టి వెంటనే టేబుల్‌పై పెడుతుంది. ఫైనల్‌గా చూస్తే.. షర్ట్ కొనేటప్పుడు ఏ విధంగా మడత పెట్టి ఉంటుందో అచ్చం అలాగే ఉంటుంది. అది కూడా క్షణాల్లో మడత పెట్టడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మహిళ టాలెంట్.. ఆనంద్ మహీంద్రాకూ తెగ నచ్చేసింది. వెంటనే ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతా (Twitter account) ద్వారా షేర్ చేశారు. ఈ మహిళ క్రియేటివిటీ సూపర్.. చిన్న చిన్న పనులను కూడా ఇలా సింపుల్ చేసుకోవచ్చు.. అని ప్రస్తావించారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Updated Date - 2023-04-09T17:00:53+05:30 IST