Viral Video: అసలు మెట్రో రైల్లోకి వాటిని ఎలా తీసుకెళ్లారు..? కుర్రాళ్ల చేష్టలపై మండి పడుతున్న నెటిజన్లు..!
ABN, First Publish Date - 2023-02-09T17:06:57+05:30
ప్రస్తుతం యువత చాలా వరకు రీల్స్ మాయలో పడిపోయింది. రోజూ ఏ పని చేయకున్నా కూడా.. రీల్స్ చేయడం మత్రం విధిగా పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకరిని మించి మరొకరు వినూత్న వీడియోలు చేస్తుంటారు. కొందరైతే..
ప్రస్తుతం యువత చాలా వరకు రీల్స్ మాయలో పడిపోయింది. రోజూ ఏ పని చేయకున్నా కూడా.. రీల్స్ చేయడం మత్రం విధిగా పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకరిని మించి మరొకరు వినూత్న వీడియోలు చేస్తుంటారు. కొందరైతే అందరి దృష్టిని ఆకర్షించేందుకు చిత్రవిచిత్రమైన ప్రయోగాలు చేస్తుంటారు. వీటిలో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని కోపం తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు మెట్రో రైల్లోకి వాటిని ఎలా తీసుకెళ్లారు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఢిల్లీ మెట్రో రైల్లో (Delhi Metro Rail) ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు యువకులు రైల్లో రీల్స్ వీడియోలు (Reels videos) చేసేందుకు సిద్ధమవుతారు. అయితే రోటీన్‌గా కాకుండా ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకుంటారు. ప్రయాణికులను ఆట పట్టించి, తద్వారా వీడియోను వైరల్ చేయాలని అనుకుంటారు. ముందుగా బోగీలోని డోరు వద్ద అడ్డుగా ఎర్రటి రిబ్బన్ (Red ribbon) కడతారు. రైలు స్టేషన్‌కి చేరుకోగానే ఓ యువకుడు చేతిలో కత్తెర పట్టుకుని నిలబడి ఉంటాడు. ఇదేమీ ఊహించని ప్రయాణికులు.. హడావుడిగా లోపలికి ఎక్కేస్తారు. బోగీలోకి రాగానే అడ్డుగా రిబ్బన్ కట్టి ఉండటాన్ని చూసి అవాక్కవుతారు. ఇంతలో అక్కడ నిలబడ్డ బాలుడు.. ‘‘రండి సార్.. రిబ్బన్ కట్ చేసి బోగీలోకి ప్రవేశించండి’’.. అని ఆహ్వానిస్తాడు.
ఇదేదో కామెడీగా ఉందే.. అనుకున్న ఓ వ్యక్తి, రిబ్బన్ పైకి ఎత్తి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. ఆహ్వానించిన యువకుడి బలవంతంతో ఓ వ్యక్తి కత్తెరతో (scissors) రిబ్బన్ కట్ చేస్తాడు. తర్వాత అంతా బోగీలోకి వస్తారు. ఈ ఘటనను చూసి పక్కనే ఉన్న యువతులు.. నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు (Viral videos) కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. రీల్స్ కోసం కోతి చేష్టలు చేయడం సర్వసాధారణమైంది.. అంటూ కొందరు, అసలు కత్తెర వంటి ఆయుధాలు మెట్రో స్టేషన్‌లోకి ఎలా అనుమతించారు.. అని ఇంకొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
Updated Date - 2023-02-09T17:12:50+05:30 IST