Accident video: విధి విచిత్రమైనదంటే ఇదేనేమో.. లేకపోతే.. చూస్తుండగానే ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించగరలా..
ABN, First Publish Date - 2023-10-14T21:46:40+05:30
విధి ఎంతో విచిత్రమైనది. అప్పటిదాకా ఏడుస్తున్న వారిని.. అప్పటికప్పుడే నవ్వించగలదు. అలాగే సంతోషంగా సాగుతున్న జీవితాల్లో ఉన్నట్టుండీ విషాదాన్నీ నింపగలదు. ఇందుకు నిదర్శనంగా నిత్యం మన కళ్లముందు ఎన్నో సంఘటలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం...
విధి ఎంతో విచిత్రమైనది. అప్పటిదాకా ఏడుస్తున్న వారిని.. అప్పటికప్పుడే నవ్వించగలదు. అలాగే సంతోషంగా సాగుతున్న జీవితాల్లో ఉన్నట్టుండీ విషాదాన్నీ నింపగలదు. ఇందుకు నిదర్శనంగా నిత్యం మన కళ్లముందు ఎన్నో సంఘటలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి విషాద ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న మహిళ.. ఉన్నట్టుండి ప్రమాదానికి గురైన వీడియో చూసి నెటిజన్లు.. అయ్యో పాపం! ఎంత ఘోరం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) నోయిడా హౌసింగ్ సోసైటీలో ఈ ఘటన చోటు చేసుకుంది. నోయిడా సెక్టార్-78లోని మహాగున్ మోడరన్ సొసైటీలో ఉన్నట్టుండి విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 76 ఏళ్ల కృష్ణ నారంగ్ అనే మహిళ నడుచుకుంటూ వెళ్తోంది. కాస్త దూరం వెళ్లగానే ఓచోట ఆమె ఆగి రోడ్డు పక్కగా చూసింది. అయితే అప్పటికే ఓ కారు పక్క నుంచి వేగంగా ఆమె వైపు రాబోయింది. దీంతో ఆపండి అంటూ వృద్ధురాలు చేయి చూపించింది. అయినా డ్రైవర్ వేగంగా వచ్చి (car hit the old woman) ఆమెను ఢీకొన్నాడు. వృద్ధురాలని ఢీకొన్న కారు కొంత దూరం ఈడ్చుకెళ్లి ఆగిపోయింది. ఉన్నట్టుండి చోటు చేసుకున్న ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. పరుగున పరుగున అక్కడికి చేరుకుని ఆమెను కాపాడే ప్రయత్నం చేశారు.
తర్వాత కారు డ్రైవర్ కూడా కిందకు దిగి ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వృద్ధురాలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారించారు. కారు డ్రైవర్ ఫోన్ మాట్లాడుకుంటూ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపినట్లు తెలిసింది. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘‘అయ్యో పాపం! ఎంత ఘోరం జరిగింది’’.. అని కొందరు, ‘‘ఇలాంటి డ్రైవర్ల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయ్’’.. అని మరికొందరు, ‘‘ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని కఠినంగా శిక్షించాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
WhatsApp alert: అక్టోబర్ 24 నుంచి వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్లు ఉన్నాయేమో.. చెక్ చేసుకోండి..
Updated Date - 2023-10-14T21:47:33+05:30 IST