ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Train Video: అంకుల్ అని పిలిస్తే కాలదా ఏంటీ..? రైల్లో వెళ్తున్న ఓ కుర్రాడు అంకుల్ అని పిలవగానే ఆ వ్యక్తి రియాక్షన్ చూస్తే..!

ABN, First Publish Date - 2023-10-17T16:42:27+05:30

రైలు ప్రయాణ సమయాల్లో అనూహ్య ఘటనలతో పాటూ అప్పుడప్పుడూ ఆసక్తికర ఘటనలూ చోటు చేసుకుంటుంటాయి. మరికొన్నిసార్లు సీరియస్‌గా మొదలైన వాగ్వాదం కాస్తా.. చివరకు ఫన్నీగా మారుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తరచూ చూస్తూ ఉంటాం. తాజాగా..

రైలు ప్రయాణ సమయాల్లో అనూహ్య ఘటనలతో పాటూ అప్పుడప్పుడూ ఆసక్తికర ఘటనలూ చోటు చేసుకుంటుంటాయి. మరికొన్నిసార్లు సీరియస్‌గా మొదలైన వాగ్వాదం కాస్తా.. చివరకు ఫన్నీగా మారుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తరచూ చూస్తూ ఉంటాం. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రైల్లో వెళ్తున్న ఓ కుర్రాడు.. డోరు వద్ద కింద కూర్చున్న వ్యక్తిని ‘‘అంకుల్.. లేవండి’’.. అంటూ పదే పదే పిలుస్తున్నాడు. దీంతో చివరకు ఆ వ్యక్తి ఇచ్చిన రియాక్షన్ చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

ముంబై లోకల్ ట్రైన్‌లో (Mumbai Local Train) ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్లో ప్రయాణికులు కిక్కిరిసి ఉంటారు. కొందరు డోరు వద్ద నిలబడి ఉండగా.. కొందరు కిందనే కూర్చుని ఉంటారు. కనీసం అడుగుపెట్టడానికి కూడా స్థలం లేనంతగా రద్దీ ఉంటుంది. అయితే ఈ సమయంలో అనూహ్యంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ రాబోతుండడంతో దిగాల్సిన వారంతా తలుపు వద్దకు వస్తారు. అయితే తలుపు వద్ద ఓ వ్యక్తి కూర్చుని ఉంటాడు. దీంతో దిగాల్సిన వాళ్లలో ఓ కుర్రాడు.. ‘‘అంకుల్.. స్టేషన్ వస్తోంది.. పైకి లేవండి’’.. అని అంటాడు. అంకుల్ అనే మాట వినగానే కింద కూర్చున్న అతడికి కోపం నశాలానికి అంటింది. దీంతో ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా అలాగే కూర్చుని ఉంటాడు.

Israel Youth: భారత్‌లో మినీ ఇజ్రాయెల్ ఎక్కడుందో తెలుసా..? ఇజ్రాయేలీ యూత్ అంతా ఈ సిటికీ ఎందుకు క్యూ కడుతుంటారంటే..!

దీంతో సదరు కుర్రాడు మళ్లీ అతడితో ‘‘అంకుల్ మీకే చెప్పేది.. ఒకసారి లేవండి’’.. అని అంటాడు. ఇందుకు బదులుగా కింద కూర్చున్న వ్యక్తి.. ‘‘మీరు ఎవరిని పిలుస్తున్నారో అర్థం కాలేదు’’.. అని అంటాడు. దీనికి ఆ కుర్రాడు.. ‘‘కింద కూర్చున్నది ఎవరు’’.. అని అంటాడు. దీంతో వెంటనే కింద కూర్చున్న వ్యక్తి ‘‘మరి అంకుల్ ఎవరు’’ అని అనగానే.. కుర్రాడికి విషయం అర్థమవుతుంది. చివరగా లేవండి బ్రదర్.. అని పిలిచి అతన్ని కూల్ చేస్తాడు. ఇలా వీరి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అవును అలా పిలిస్తే.. కోపం రాకుండా ఎలా ఉంటుంది’’.. అని కొందరు, ‘‘అంకుల్.. బాగా సమాధానం ఇచ్చాడు’’.. అని మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 78వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: మొదటిసారి ఎస్కలేటర్ ఎక్కిన మహిళలు.. మధ్యలోకి వెళ్లగానే.. ఒక్కసారిగా ఏమైందో చూడండి..

Updated Date - 2023-10-17T16:42:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising