School boys: చూసేందుకు వీళ్లు చేస్తోంది అల్లరే అయినా.. అందులో దాగున్న వారి ట్యాలెంట్ చూస్తే.. చప్పట్లు కొట్టాల్సిందే..
ABN, First Publish Date - 2023-09-03T15:51:08+05:30
స్కూల్ డేస్‌లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో బడికి డుమ్మా కొట్టి ఆటలు ఆడుకోవడం, ఒకవేళ బడికి వెళ్లినా పాఠాలు వినకుండా తరగతి గదుల్లో అల్లరి చేయడం.. వంటి తింగరి చేష్టలు చేసే ఉంటారు. కానీ అందులోనే అసలు టాలెంట్ దాగి ఉంటుంది. దాన్ని గుర్తించలేక కొందరు..
స్కూల్ డేస్‌లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో బడికి డుమ్మా కొట్టి ఆటలు ఆడుకోవడం, ఒకవేళ బడికి వెళ్లినా పాఠాలు వినకుండా తరగతి గదుల్లో అల్లరి చేయడం.. వంటి తింగరి చేష్టలు చేసే ఉంటారు. కానీ అందులోనే అసలు టాలెంట్ దాగి ఉంటుంది. దాన్ని గుర్తించలేక కొందరు తమ లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో తికమకపడుతుంటారు. అయితే కొన్నిసార్లు అనుకోకుండా వారి వారి ప్రతిభాపాటవాలు బయటపడిపోతుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, విద్యార్థులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు విద్యార్థులు స్కూల్లో అల్లరి చేస్తూ కనిపించారు. కానీ అందులో దాగున్న వారి టాలెంట్‌ని చూసి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ స్కూల్ తరగతి గదిలో విరామ సమయంలో విద్యార్థులంతా ఆడుకోవడానికి వెళ్లగా.. నలుగురు విద్యార్థులు (Students) మాత్రం తమ ట్యాలెంట్‌ని బయటపెడతారు. ఓ విద్యార్థి కూర్చుని ఉండగా.. ముగ్గురు విద్యార్థులు వరుసగా నిల్చుని బెంచి మీద చేతులతో కొడుతూ శబ్ధాలు (Sounds) చేస్తారు. వారిలో ఓ విద్యార్థి పెన్నులు పట్టుకుని బెంచ్‌పై కొడితే, మరో విద్యార్థి కాంబాక్స్‌పై పెన్నులతో లయబద్ధంగా కొడుతూ ఉంటారు. ఇలా అంతా కలికట్టుగా ఓకేలా దరువు మొదలెడతారు.
Viral Video: ఏనుగు పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. అంతెత్తున ఉన్న పనస పండ్లను ఎలా తెంచేసిందో చూడండి..
ఇది చూడటానికి అచ్చం ప్రొఫెషనల్స్ డ్రమ్ములు (Playing the drums) వాయించినట్లుగానే ఉంటుంది. విద్యార్థుల ట్యాలెంట్ చూసి అక్కడున్న వారంతా అలాగే చూస్తూ ఉండిపోతారు. కొందరు పిల్లలు కాలు కదుపుతూ ఎంజాయ్ చేయడం వీడియోలో చూడొచ్చు. మొత్తానికి ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీరు పిల్లలు కాదు పిడుగులు’’.. అని కొందరు, ‘‘వీరికి మంచి భవిష్యత్ ఉంటుంది’’.. అని మరికొందరు, ‘‘చదువుతో పాటూ మీ ట్యాలెంట్‌కూ పదునుపెడితే తప్పకుండా పైకొస్తారు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 38లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-09-03T15:51:08+05:30 IST