ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వామ్మో! రైలు క్యాంటిన్‌లో ఇలా కూడా జరుగుతుందా.. ప్రయాణికులను కలవరపెడుతున్న వీడియో..

ABN, First Publish Date - 2023-10-20T07:49:51+05:30

రైలు ప్రయాణమంటే ఇష్టపడని వారుండరు. దూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా రైళ్లలో వెళ్లేందుకే మొగ్గుచూపుతుంటారు. అయితే మరోవైపు ఈ ప్రయాణంలో అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. సీటు కోసం కొన్నిసార్లు చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఈ విషయం పక్కన పెడితే ప్రయాణ సమయంలో...

రైలు ప్రయాణమంటే ఇష్టపడని వారుండరు. దూర ప్రయాణాలు చేసేవారు ఎక్కువగా రైళ్లలో వెళ్లేందుకే మొగ్గుచూపుతుంటారు. అయితే మరోవైపు ఈ ప్రయాణంలో అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. సీటు కోసం కొన్నిసార్లు చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఈ విషయం పక్కన పెడితే ప్రయాణ సమయంలో ఎప్పుడు ఎలాంటి ఫుడ్ కావాలన్నా రైల్లోనే అందుబాటులో ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఇలా ఆర్డర్ చేయగానే.. బోగీలోని క్యాంటిన్‌ నుంచి అలా మనవద్దకు ఆర్డర్ వచ్చేస్తుంటుంది. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో రైలు ప్రయాణికులను కలవరపెడుతోంది. రైలు క్యాంటిన్‌లో ఇలాక్కూడా జరుగుతుందా.. అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రయాణికుడు మడ్గావ్ ఎక్స్‌ప్రెస్‌లో (Madgaon Express) ప్రయాణిస్తుండగా తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ఓ వీడియోను షేర్ చేశాడు. రైలు ప్యాంట్రీ కారును (train pantry car) వీడియో తీయడానికి వెళ్లిన అతడికి షాకింగ్ దృశ్యం కనిపించింది. వంట చేసే ప్రదేశంలో ఉన్నట్టుండి చాలా ఎలుకలు (Rats) అటూ ఇటు పరుగెత్తడంతో పాటూ వంట పాత్రలలోకి దూరి మరీ ఆహారం తింటున్నాయి. అటు పక్కనే టేబుల్‌పై వంటకు సిద్ధం చేస్తున్న కూరగాయలను కూడా చూడొచ్చు. రైలు బోగీలోకి ఎలుకలు రావడమే కాకుండా వంట గదిలోకీ ప్రవేశించడం అందరినీ ఆందోళను గురి చేస్తోంది. ఈ ఘటనను వీడియో తీసిన సదరు యువకుడు.. దీనిపై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో చివరకు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Viral Video: ఫుట్‌పాత్‌పై వెళ్తున్నా ప్రాణాలు దక్కలేదు.. పాపం ఈ అమ్మాయిల విషయంలో ఏం జరిగిందో చూడండి..

అలాగే రైల్వే యాప్ ద్వారా కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. అయితే దీనిపై ఇండియన్ రైల్వే క్యాటరింగ్, కార్పొరేషన్ (IRCTC) ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని తాము తీవ్ర పరిగణిస్తూ తగిన చర్యలు తీసుకున్నామని, పరిశుభ్రత విషయంలో సిబ్బందికి అవగాహన కల్పించడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారు. కాగా, ప్యాంట్రీ కారులోని ఎలుకల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మె! ఇదేంటీ మరీ దారుణం’’.. అని కొందరు, ‘‘ఇకపై రైల్లో భోజేనం తినాలంటేనే ఆలోచించాలేమో’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బస్సు నడుపుతూనే రోడ్డు పక్కన మహిళను గమనించిన డ్రైవర్.. ఒక్క క్షణం ఆలస్యమైనా పెద్ద ఘోరమే జరిగేది..

Updated Date - 2023-10-20T07:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising