Viral Video: టెక్నాలజీని వాడుకోవడం అంటే ఇదేనేమో.. ఇకపై రైల్వే స్టేషన్లలో అంతా ఇలాగే చేస్తారేమో..
ABN, First Publish Date - 2023-09-12T20:56:13+05:30
ఇంటా, బయటా అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ పరిసరాలను అపరిశుభ్రం చేయడం సర్వసాధారణమైంది. ఇక బస్టాండ్లు, రైల్వే స్టేషన్ పరిసరాల్లో చెత్త ఎలా పేరుకుపోయి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ప్రదేశాల్లో..
ఇంటా, బయటా అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ పరిసరాలను అపరిశుభ్రం చేయడం సర్వసాధారణమైంది. ఇక బస్టాండ్లు, రైల్వే స్టేషన్ పరిసరాల్లో చెత్త ఎలా పేరుకుపోయి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి ప్రదేశాల్లో చెత్తను శుభ్రం చేయడం సిబ్బందికి పెద్ద సమస్యగా మారుతుంటుంది. అయితే మారుతున్న టెక్నాలజీని ఉపయోగించి ప్రస్తుతం.. చెత్తను ఎత్తేయడంలో వివిధ రకాల పద్ధతులను ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, రైలు పట్టాలపై చెత్తను శుభ్రం చేస్తున్న మహిళ వీడియో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. అసలే ముంబై రైళ్లు (Mumbai Trains) ప్రయాణికులతో నిత్యం కిటకిటలాడుతుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. దీంతో రైల్వే స్టేషన్ పరిసరాల్లోనూ చెత్త అంతే స్థాయిలో పేరుకుపోతుంటుంది. దీనికితోడు ప్రయాణికులు తినేసిన ప్లేట్లు తదితరాలన్నింటినీ కిటికీలోంచి పట్టాలపై పడేస్తుంటారు. దీంతో ఎక్కడ చూసినా వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెత్తాచెదారాన్ని (Garbage) చీపురుతో శుభ్రం చేయడం సాధ్యమయ్యే పనికాదు. ఇలాంటి ప్రస్తుత తరుణంలో రైలు పట్టాలపై ఓ మహిళ (woman) చెత్తను వినూత్నంగా ఎత్తేయడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.
సదరు మహిళ పట్టాలపై నడుస్తూ చేతిలో ఎయిర్ మిషన్ను పట్టుకుని సులభంగా చెత్తను ఎత్తేస్తూ ఉంది. మిషన్ నుంచి గాలి అత్యంత వేగంగా బయటికి రావడం వల్ల పట్టాల మీద పడిన చెత్త మొత్తం ముక్క కూడా మిగలకుండా కొట్టుకుపోతూ ఉంది. ఆమె వెనుకే మరికొందరు మహిళలు చీపురుతో ఎత్తను ఎత్తేయడం కూడా వీడియోలో చూడొచ్చు. వారితో పోల్చితే మిషన్తో చెత్తను ఏరేస్తున్న మహిళ పని చాలా సులభంగా ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్! వెరీ గుడ్ ఐడియా’’.. అని కొందరు, ‘‘టెక్నాలజీని వాడుకోవడం అంటే ఇదేనేమో’’.. అని మరికొందరు, ‘‘అన్ని చోట్లా ఇలాగే చేస్తే బాగుంటుంది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-09-14T21:56:18+05:30 IST